అడవుల్లో 100 కోట్ల చెట్లు 

2 May, 2018 02:36 IST|Sakshi

నాలుగో విడత హరితహారంలో నాటేందుకు కార్యాచరణ  

సాక్షి, హైదరాబాద్‌: నాలుగో విడత హరితహారంలో భాగంగా అడవుల్లో 100 కోట్ల మొక్క లు పెంచేందుకు అటవీ  అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. చెట్లను నరికి కలప స్మగ్లింగ్‌కు పాల్పడే వారిపై పీడీ చట్టం ప్రయోగించాలని నిర్ణయించారు. ఈ మేరకు సచివాలయంలో హరితహారం పురోగతిపై జిల్లాల కలెక్టర్లతో చీఫ్‌ సెక్రటరీ ఎస్‌కే జోషి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

నాలుగో విడత హరితహారం కోసం తొమ్మిది వేల నర్సరీలను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. కొత్త నర్సరీలకు స్థలం గుర్తింపు, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. అనంతరం ఎస్‌కే జోషి మాట్లాడుతూ, ఇప్పటికే జిల్లాలకు పంపిన ఫార్మాట్‌లను అన్ని వివరాలతో అటవీ శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. త్వరలోనే రాష్ట్ర, జిల్లా స్థాయిలో కొత్త నర్సరీల ఏర్పాటుపై శిక్షణ ఏర్పాటు చేస్తామన్నారు. అటవీ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖల సిబ్బంది దీనిలో పాల్గొంటారని చెప్పారు. 

మరిన్ని వార్తలు