‘ఉపాధి’కి భరోసా..‘హరితహారం’! 

23 Jun, 2019 03:46 IST|Sakshi

10 లక్షల మందికి మొక్కల పెంపకం ద్వారా 100 పనిదినాల కల్పన 

రోజుకు సగటున రూ. 211 వేతనంగా చెల్లింపు 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ఉపాధి హామీ కూలీలకు ధీమాను కల్పిస్తోంది. వచ్చేనెలలో చేపట్టనున్న ఐదో విడత హరితహారంలో భాగంగా 83.30 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. తద్వారా ఉపాధి కూలీలకు తగినంతగా పనులు కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ పథకం కింద కూలీలకు వందరోజుల పనిదినాలు కల్పించి పెద్ద ఎత్తున మొక్కల పెంపకంతో వాటి సంరక్షణకు గట్టి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.  

కిలోమీటరు దూరానికి ఒక్కో ఉపాధి కూలి... 
ఐదో విడతలో దాదాపు 10 లక్షల మంది ఉపాధి కూలీలకు మొక్కల పెంపకంలో వందరోజుల పనిదినాలను కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల వ్యవసాయ భూముల్లో నాటే ఒక్కో మొక్కకు నెలకు రూ.5 వంతున ఇచ్చి వాటి సంరక్షణకు బాటలు వేయాలని నిర్ణయించారు.. రహదారి వెంట నాటిన మొక్కల రక్షణకు ఒక్కో ఉపాధి కూలీకి కిలోమీటరు దూరం చొప్పున బాధ్యతలు అప్పగించి, రోజుకు రూ. 211 సగటు వేతనంగా చెల్లిస్తారు. మొక్కల పెంపకంతో ఉపాధి కూలీలకు కావాల్సినంత పని కల్పించడంతో పాటు హరితహారం లక్ష్యాన్నీ సాధించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంతదాకా 19.4 లక్షల కుటుంబాలకు చెందిన 31.2 లక్షల మంది కూలీలకు పని కల్పించారు, ఈ ఏడాదికి గాను 12 కోట్ల పని దినాల కల్పనకు కేంద్రం ఆమోదం తెలిపింది. గతేడాది రాష్ట్రంలో ఎక్కువ పని రోజులు కల్పించిన నేపథ్యంలో ఈ మేరకు కేంద్రం పని రోజులను పెంచింది. 2019–20 లో భాగంగా జూన్‌ 4వ తేదీ వరకు 5.7 కోట్ల పని దినాలు రూ. 147 సగటు వేతనంతో పని కల్పించి, మొత్తం రూ. 947.2 కోట్లు వెచ్చించారు. ఉపాధి హామీ పథకం ప్రారంభమైన నాటి నుంచి గత ఆర్థిక సంవత్సరంలోనే  అ«ధిక పనులు చేసిన రికార్డు రాష్ట్రంలో నమోదైంది.గతేడాది కూలీలకు రూ. 148.4 సగటు వేతనంతో 11.2 కోట్ల పని దినాలు కల్పించారు. 25.2 లక్షల కుటుంబాలకు చెందిన 42.4 లక్షల మంది కూలీలకు పని దొరికింది. రూ. 3,027 కోట్లు ఖర్చు చేశారు. కూలీలకు వేతనాలుగా రూ. 1706.1 కోట్లు, రూ. 1042.9 కోట్లు పరికరాల కోసం కేటాయించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

గ్రహణం రోజున ఆ ఆలయం తెరిచే ఉంటుంది

టిక్‌ టాక్‌ వీడియోలు.. వారిని సస్పెండ్‌ చేయలేదు!

గాలిలో విమానం చక్కర్లు.. భయభ్రాంతులు

చందానగర్ పీఎస్‌ను ఆదర్శంగా తీసుకోండి

150 మంది చిన్నారులకు విముక్తి​

ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య

‘రాష్ట్రంలో బీజేపీని అడ్డుకునేది మేమే’’

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

ఏటీఎం దొంగలు దొరికారు 

హైదరాబాద్‌ చరిత్రలో తొలిసారి...

చిన్నారిపై లైంగిక దాడి 

తండ్రిని చంపింది పెద్ద కొడుకే..

‘గురుకులం’ ఖాళీ!

ఈ ఉపాధ్యాయుడు అందరికీ ఆదర్శవంతుడు 

‘ఎస్‌ఐ రేణుక భూమి వద్దకు వెళ్లకుండా బెదిరిస్తుంది’

గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

చాలా మంది టచ్‌లో ఉన్నారు..

‘ఆలంబాగ్‌’ ఏమైనట్టు!

ఇంటికే మొక్క

‘క్యాష్‌లెస్‌’ సేవలు

కాంగ్రెస్‌ టు బీజేపీ.. వయా టీడీపీ, టీఆర్‌ఎస్‌

ప్రియుడి చేత భర్తను చంపించిన భార్య

పరిమళించిన మానవత్వం

ఆశల పల్లకిలో ‘కొత్తపల్లి’

ఒకే రోజులో ట్రిపుల్‌ సెంచరీ

ట్రిబుల్‌..ట్రబుల్‌

పెబ్బేరులో మాయలేడి..!

వైఎంసీఏలో ఫుడ్‌ పాయిజన్‌

పూడ్చిన శవాలను కాల్చేందుకు యత్నం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’