107కు చేరిన ఏకగ్రీవాలు 

23 Jan, 2019 14:02 IST|Sakshi

ఆత్మకూరు(పరకాల): అధికార పార్టీ వ్యూహం ఫలించింది. జిల్లాలో అత్యధిక స్థానాలను ఏకగ్రీవం చేయగలిగింది. మొదటి విడతలో 45 జీపీలు ఏకగ్రీవం కాగా రెండో విడతలో 33 ఏకగ్రీవమయ్యాయి. తాజాగా మంగళవారం మూడోవిడత ఉపసంహరణ ఘట్టం ముగియడంతో 29 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మూడోవిడతలో 120 స్థానాలకు గాను 29 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. చెన్నారావుపేట మండలంలో 30 జీపీలకు కాలనాయక్‌తండా, బోజెర్వు, ఖాదర్‌పేట, గొల్లభామతండా, తిమ్మరాయనిపహాడ్‌ గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యాయి. నెక్కొండ మండలంలో 39 జీపీలకు అలంకానిపేట, లావుడ్యానాయక్‌ తండా, వెంకటనాయక్‌తండా, రెడ్యానాయక్‌తండా, హరిచంద్‌తండా, చెరువుముందరి తండా, నెక్కొండ తండా, దేవునితండా, అప్పలరావుపేట, మూడుతండా, గొల్లపల్లి, మేడిపల్లి గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.ఆత్మకూరు మండలంలో 16జీపీలకు గాను పెంచికలపేట, గూడెప్పాడ్, కామారం జీపీలు ఏకగ్రీవమయ్యాయి. దామెర మండలంలో 14జీపీలకు కొగిల్వాయి, సింగరాజుపల్లె, ల్యాదళ్ల, దమ్మన్నపేట, దుర్గంపేట, సీతారాంపురం జీపీలు ఏకగ్రీవమయ్యాయి.

గీసుకొండ మండలంలో 21జీపీలకు గాను గీసుకొండ, మచ్చాపూర్, మరియపురం, హర్జతండా జీపీలు ఏకగ్రీవమయ్యాయి. æ ఏకగ్రీవమైతే గ్రామాలు అభివృద్ధి అవుతాయనే సంకల్ప ంతో గ్రామాల్లో అందరూ ఒక్కటై జీపీలను ఏకగ్రీవం చేసుకుంటున్నారు. జిల్లాలో ఏకంగా మొదటి విడతలో గతపర్యాయం జిల్లా మొత్తం లో 23 పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఇప్పుడు మొదటివిడతలోనే 45 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. రెండో విడతలో 33 జీపీలు, మూడోవిడతలో 29జీపీలు ఏకగ్రీవం కావడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడతలో అత్యధికంగా పర్వతగిరి మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మూడోవిడతలో అత్యధికంగా నెక్కొండలో 12 జీపీలు ఏకగ్రీవమయ్యాయి.

గులాబీ వ్యూహం సక్సెస్‌..
అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన అధికార పార్టీ జీపీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఎలాగైనా అత్యధిక స్థానాలను ఏకగ్రీవం చేయాలని గులాబీబాస్‌ ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చారు.దీంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఏకగ్రీవం వైపు పావులు కదిపారు. ఈ దిశలో సక్సెస్‌ సాధించారు.

నజరానా వస్తుందని..
ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం అందించే రూ.10లక్షల నజరానాకు తోడు ఎమ్మెల్యేల నిధుల నుంచి రూ.15 లక్షల నిధులు ఇవ్వడానికి ముందుకొచ్చారు. గ్రామానికి రూ.25లక్షల నిధులు వస్తుండడంతో గ్రామాలలో ప్రజలు పార్టీలను పక్కనపెట్టి ఏకగ్రీవం వైపు కదిలారు.107కు చేరిన ఏకగ్రీవాలు 

మరిన్ని వార్తలు