వైఎస్ హయాంలో 108 అద్భుతంగా పనిచేసింది: కేసీఆర్

28 Nov, 2014 15:20 IST|Sakshi
వైఎస్ హయాంలో 108 అద్భుతంగా పనిచేసింది: కేసీఆర్

గత ప్రభుత్వాల హయాంలో కూడా కొన్ని మంచి కార్యక్రమాలు జరిగాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 108 అంబులెన్స్ సర్వీసు చాలా అద్భుతంగా పనిచేసిందని ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఇంకా ఏర్పడక ముందు, ఉద్యమంలో ఉండగా తాను ఒకసారి పరకాల వెళ్తున్నానని, రోడ్డు ప్రమాదంలో ఓ మనిషి అక్కడికక్కడే పడిపోయాడని ఆయన చెప్పారు. తాను కారు ఆపి వెంటనే దిగానని, కానీ అక్కడున్న పిల్లలు ఏం పర్వాలేదు, 10 నిమిషాల్లో 108 వస్తుందని తనకు చెప్పారని కేసీఆర్ అన్నారు. జనంలో ఆ అంబులెన్సు పట్ల ఉన్నవిశ్వాసాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు