వడదెబ్బతో 11మంది మృతి

2 Jun, 2015 03:22 IST|Sakshi

గౌరయపల్లి వృద్ధురాలు. .
 చేర్యాల : మండలంలోని గౌరయపల్లికి చెందిన పెద్ద యశోద(60) వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది. యశోదకు భర్త గతంలోనే మృతిచెందాడు. మృతురాలికి ఇద్దరు కుమారలు, ఒక కూతురు ఉన్నారు.
 పీచరలో ఒకరు..
 ధర్మసాగర్ : మండలంలోని పీచరకు చెందిన నాగారపు ఆగయ్య(58) ఆదివారం పని నిమిత్తం బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో వడదెబ్బకుగురై అదేరోజు రాత్రి మృతిచెందాడు.

 మరిపెడలో..
 మరిపెడ : మండల కేంద్రంలోని సీతారాంపురం వీధికి చెందిన బయ్య లాలయ్య(65) రెండు రోజల క్రితం కూలిపనికి వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. చికిత్స పొందుతూ ఆది వారం రాత్రి మృతిచెందాడు. మృతునికి భా ర్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
 నర్మెటలో...
 నర్మెట : మండల కేంద్రానికి చెందిన ఆమెడపు సిద్దమ్మ(70) కొద్ది రోజులుగా ఎండలకు అస్వస్థతకు గురైంది. సోమవారం ఉదయం దాహం అంటూ కుప్పకూలి మృతి చెందింది. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

 కంచనపల్లిలో యువకుడు..
 రఘునాథపల్లి : మండలంలోని కంచనపల్లికి చెందిన ఎలబోయిన రాజు(24) వడదెబ్బకు గురై సోమవారం మృతిచెందాడు. రాజు గత నెల 31న గ్రామంలో కర్ర కొట్టేందుకు కూలీ పనులకు వెళ్లాడు. వడదెబ్బకు గురై వాంతు లు, విరేచనాలు చేసుకోవడంతో స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించారు. సోమవారం తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు.
 మడిపల్లిలో వృద్ధురాలు
 మడిపల్లి(హసన్‌పర్తి) : వడదెబ్బతో మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన ఎర్ర  రామమ్మ(75) ఆదివారం వడదెబ్బకు గురైంది. ఆమెకు వైద్యం అందించినప్పటికీ లాభం లేకపోయింది. సోమవారం మధ్యాహ్నం తుది శ్వాసవిడిచింది.

 కోమటిపల్లిలో ఒకరు..
 మంగపేట : మండలంలోని కోమటిపల్లికి చెందిన సంకి లక్ష్మి(60) వడదెబ్బకు గురై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది.
 శాతపురంలో మహిళ
 శాతపురం(పాలకుర్తి) : మండలంలోని శాతపురం గ్రామానికి చెందిన చక్రవర్తుల వకులామాలిక(45) వడదెబ్బతో అనారోగ్యానికి గురై మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.

 కమలాపురంలో ఒకరు..
 కమలాపురం(మంగపేట) : మండలంలోని కమలాపురానికి చెందిన గ్యారె సాంబయ్య(52) వడదెబ్బతో సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.  
 జనగామలో వృద్ధురాలు..
 జనగామ రూరల్ : పట్టణంలోని 8వ వార్డుకు చెందిన కొమ్మ నర్సమ్మ(64) వడదెబ్బతో ఆదివారం రాత్రి మృతిచెందారు. మృతురాలికి భర్త నర్సయ్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సోమవారం బాధిత కుటుంబాన్ని స్థానిక వార్డు కౌన్సిలర్ జక్కుల అనిత, నాయకులు జక్కుల వేణు, ఎర్రంరెడ్డి రాంరెడ్డి, ఎండీ.కమాలూద్దీన్, బేజాడి కేశవులు, జిగురు రాములు, యాదవరెడ్డి పరామర్శించి ఓదార్చారు.

 మీట్యా తండాలో..
 నెల్లికుదురు : మండలంలోని చిన్ననాగారం శివారు మీట్యాతండాకు చెందిన బానోతు రాంజి(30) వడదెబ్బతో సోమవారం మృతిచెందాడు. ఆదివారం ఎద్దుల బండిపై పశువుల పేడను పంట పొలంలో తోలాడు. మధ్యాహ్నం వడదెబ్బకు గురైన రాంజీ రాత్రి నీరసంతో పడుకున్నాడు. భార్య తెల్లవారి లేచిచూసేసరికి మృతిచెందాడు.

మరిన్ని వార్తలు