11వ రోజూ ఉధృతంగా సమ్మె

16 Oct, 2019 03:31 IST|Sakshi
వనపర్తి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ

నేడూ సమ్మె కొనసాగించాలని కార్మిక సంఘాల పిలుపు 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గ కుండా సమ్మె ఉధృతంగా కొనసాగిస్తున్నారు. 11 రోజైన మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు. ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు కార్మికుల సంతాప సభలు కొన్ని ప్రాంతాల్లో మంగళవారం కొనసాగాయి. ఓ వైపు ప్రభుత్వం చర్చలకు పిలిచే అవకాశం ఉందన్న మాటలు.. కోర్టు జోక్యంతో అందుకు అనుకూల పరిస్థితి ఉంటుందన్న సంకే తాలతో సమ్మె ఆగిపోయే పరిస్థితి ఉంటుందం టూ కాస్త ఊహాగానాలు వినిపించినా మంగళవారం రాత్రి వరకు ఆ సూచనలు అందకపోవ టంతో కార్మికులు యథావిధిగా సమ్మె కొనసాగించారు. టీఎన్‌జీవో, టీజీవోలు కూడా సమ్మెకు మద్దతు ఇస్తున్నట్లు మంగళవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించటంతో ఆర్టీసీ కార్మికుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. ఉద్యోగ సంఘాలతో ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చించి మద్దతు కూడగట్టుకోగలిగారు. సకలజనుల సమ్మె తరహాలో ఉధృతం చేద్దామంటూ నేతలు వాట్సాప్‌ గ్రూపుల్లో సందేశాలు పంపటంతో ఉత్సాహం రెట్టింపైంది. బుధవారం మరింత ఉధృతంగా సమ్మె నిర్వహించాలన్న ఆదేశాలూ అందాయి.

62 శాతం బస్సులు తిప్పాం: ఆర్టీసీ
తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 62.13 శాతం బస్సు సర్వీసులు తిప్పినట్లు సంస్థ తెలిపింది. 4,192 ఆర్టీసీ, 1,952 అద్దె బస్సులు కలిపి 6,144 బస్సులు తిప్పినట్లు పేర్కొంది. ఇక కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఇబ్ర హీంపట్నం డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న బూడిద జంగయ్య.. ఆర్టీసీ సమ్మె వార్తలు విని మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు.
 

మరిన్ని వార్తలు