ఆదిలాబాద్‌లో 12 డిగ్రీలు!

3 Nov, 2017 00:59 IST|Sakshi

రాష్ట్రంలో రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో సాధారణం కంటే ఆరు డిగ్రీలు తక్కువగా 16 డిగ్రీలు, భద్రాచలం, హకీంపేటల్లో 17 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

అలాగే శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఆదిలాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, మెదక్‌ జిల్లాల్లో అక్కడక్కడ సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా