శునకాలకు వింతరోగాలు

8 Apr, 2020 08:37 IST|Sakshi
మృతి చెందిన కుక్కలు(శునకాలు)

రెండు రోజుల్లో 12 కుక్కలు మృతి

భయంతో వణుకుతున్న ఓడేడ్‌ గ్రామస్తులు

పెద్దపల్లి, ముత్తారం(మంథని): ఒక ప్రక్క రాష్ట్రంలో కరోనా వైరస్‌తో ఇంటి నుంచి బయటకు రావడానికి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకున్న తరుణంలో మండలంలో వీధుల వెంట తిరిగే కుక్కలు(శునకాలు) సైతం వింత వ్యాధులతో మృతి చెందడంతో ప్రజలు మరింత భయబ్రాంతులకు గురవుతున్నారు. మండలంలోని ఓడేడ్‌ గ్రామంలో వీధి కుక్కలు ఎక్కడిక్కడే కుప్పకూలుతున్నాయి.

రెండు రోజులుగా గ్రామంలో సుమారుగా 12 కుక్కల వరకు రోడ్లపై కుప్పకూలి చనిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌మీడియాలో అమెరికాలోని బ్లాంక్‌జూలో పులికి కరోనా వ్యాధి వచ్చిందని వార్తలు రావడంతో కుక్కలకు కూడా ఏదైన రోగం వచ్చిందా? ఆందోళన చెందుతున్నారు. . ఈవిషయంపై పశు వైధ్యాధికారి హన్నన్‌ను వివరణ కోరగా గ్రామంలో కుక్కలు మృతిచెందాయని తమ దృష్టికి వచ్చిందని మూడు రోజుల క్రితం సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణంను పిచికారి చేయడంతో గ్రామంలోని గడ్డిని తిని ఇలా చనిపోయి ఉంటాయని అన్నారు. మళ్లీ కుక్కలు చనిపోతే పోస్ట్‌మార్టం చేస్తామని తెలిపారు. అ లాగే గ్రామాల్లో కుక్కలకు సరైన ఆహారం దొరకకకూడా చనిపోయి ఉంటాయని, గ్రామస్తులు భయ బ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు.

మరిన్ని వార్తలు