పేకాట అడ్డాపై దాడి : 12 మంది అరెస్టు

3 Jul, 2015 19:16 IST|Sakshi

కుత్బుల్లాపూర్ (హైదరాబాద్) : పేకాట అడ్డాపై పోలీసులు దాడి చేసి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. కొంపల్లి సురేఖ ఆస్పత్రి వెనుక భాగంలో ఉన్న ఓ అపార్టుమెంట్‌లోని ఫ్లాట్‌లో కొందరు పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది.

దాంతో శుక్రవారం పేకాట అడ్డాపై ఆకస్మిక దాడి చేయగా 12 మంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ. 65,900 నగదు, 11 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకుని వారిని స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు