12 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

6 Feb, 2015 01:04 IST|Sakshi
12 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

జిల్లాలో 158 పరీక్ష కేంద్రాలు
 
విద్యారణ్యపురి : జిల్లాలో ఇంటర్  ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బీపీసీ,  ఒకేషనల్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు ఈ నెల 12వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు నిర్వహించబోతున్నారు. ఈ నెల 17న మహాశివరాత్రి సందర్భంగా పరీక్ష ఉండదని ఇంటర్ విద్య ఆర్‌ఐఓ మలహల్‌రావు గురువారం వెల్లడించారు. మిగతా రోజుల్లో యథావిధిగా ఆదివారం, రెండో శనివారం కలిపి పరీక్షలు జరుగుతాయన్నారు. కళాశాలల వారిగా టైం టేబుల్, హాల్‌టికెట్లు, ఓఎం ఆర్ మార్కుల జాబితాలను పంపిస్తున్నామన్నారు. జిల్లాలో సైన్స్ ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణకు 158 పరీక్షా కేంద్రాలు కేటాయించారన్నారు.

పరీక్షలకు మొత్తం 16,183 మంది ఎంపీసీ, 8,690 మంది బీపీసీ విద్యార్థులు మొత్తంగా 24,873మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. ఒకేషనల్ ఫస్టియర్‌లో 4,576 మంది, సెకండియర్‌లో 3,817 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు ప్రతి రోజు టైంబేబుల్‌ప్రకారం ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు, మధ్యాహ్నం 2 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.  
 

మరిన్ని వార్తలు