పీడీఎస్‌కు 1.20 లక్షల టన్నులబియ్యం

17 May, 2019 01:01 IST|Sakshi

మిల్లర్ల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయం 

క్వింటాల్‌ బియ్యానికి రూ. 2,640  

పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌) అదనపు అవసరాల కోసం 1.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ముడి బియ్యాన్ని రాష్ట్రం లోని బియ్యం మిల్లుల యజమానుల నుంచి కొనుగోలు చేయాలని పౌర సరఫరాలశాఖ నిర్ణయించింది. ప్రస్తుత నెల నుంచి సేకరణ మొదలు పెట్టి జూలై నాటికి పూర్తిగా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  బియ్యం సేకరణకు సంబంధించి గురువారం పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ కొన్ని సూచనలతో ఉత్తర్వులు జారీ చేశారు. మిల్లర్లు తమ సంచుల్లోనే గ్రేడ్‌–1 ముడి బియ్యాన్ని క్వింటాలుకు రూ.2,640 చొప్పున సరఫరా చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మాత్రమే బియ్యం రూపంలో సరఫరా చేయాలి తప్పితే ఇతర రాష్ట్రాల ధాన్యాన్ని స్టేట్‌పూల్‌ కింద చూపితే చర్య లు తీసుకుంటారు. నిబంధనలు ఉల్లంఘించే రైసు మిల్లర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టడంతోపాటు భవిష్యత్తులో స్టేట్‌ పూల్, సన్నబియ్యం కస్టమ్‌ మిల్లింగులో కేటాయింపులను నిలిపివేస్తారు. పౌర సరఫరాల శాఖకు సరఫరా చేసే బియ్యం సంచులపై ‘స్టేట్‌ పూల్‌ రైస్‌’అని ముద్రించడంతోపాటు రైసుమిల్లరు పేరు, చిరునామా, స్టాక్‌ వివరాలు నమోదు చేయాలి. బియ్యం సేకరణ త్వర గా జరిగేలా కలెక్టర్లు రైసు మిల్లర్లు, పౌర సరఫరాల సంస్థ, కార్పొరేషన్‌ అధికారులతో  సమావేశాలు ఏర్పాటు చేయాలి. 2017 అక్టోబర్‌ తర్వాత 6ఏ కేసులు, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్న మిల్లర్ల నుంచి స్టేట్‌పూల్‌ బియ్యం సేకరించొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

కమిటీ నిర్ణయం మేరకు.. 
 2018–19 ఖరీఫ్‌ సీజన్‌లో స్టేట్‌పూల్‌ కింద 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ముడి బియ్యాన్ని కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయిం చింది. దీనిలో భాగంగా గ్రేడ్‌–1 ముడి బియ్యాన్ని క్వింటాలుకు రూ.2,841 చొప్పున సరఫరా చేసేందుకు మిల్లర్లు అంగీకరించారు. ఈ–టెండర్ల ద్వారా ఎక్కువ ధరను టెండరుదారు కోరుతుండటంతో ఎఫ్‌సీఐ ద్వారా 0.30 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం సేకరించాలని పౌర సరఫరాల శాఖ ప్రతిపాదించినా, కేంద్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో పీడీఎస్‌ కింద ఏడు నెలలపాటు సరఫరా చేయాల్సిన 2.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ముడి బియ్యాన్ని రాష్ట్ర మిల్లర్ల నుంచే సేకరించా లని నిర్ణయించి డీజీఎం(పీడీఎస్‌), డిప్యూటీ కమిషనర్, జాయింట్‌ కమిషనర్, జనరల్‌ మేనేజర్‌ (మార్కెటింగ్‌)తో కమిటీ ఏర్పాటు చేశారు. మే 3న కమిటీ సంప్రదింపులతో క్వింటాలు బియ్యా న్ని రూ.2,640 చొప్పున సరఫరా చేసేందుకు మిల్లర్లు అంగీకరించారు. 

మరిన్ని వార్తలు