రైల్వేస్టేషన్‌లో 13 కిలోల వెండి స్వాధీనం

3 Oct, 2014 00:21 IST|Sakshi
రైల్వేస్టేషన్‌లో 13 కిలోల వెండి స్వాధీనం

పోలీసుల అదుపులో ఇద్దరు

వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్‌లో బిల్లులు లేకుండా తరలిస్తున్న 13 కిలోల వెండిని జీఆర్పీ సిబ్బంది పట్టుకున్నారు. జీఆర్పీ సీఐ రవికుమార్ కథనం ప్రకారం...  తమిళనాడు సేలం జిల్లా సేలమంచి ప్రాంతానికి చెందిన అర్జునన్, మారెప్పన్ కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి చక్ర గోల్డ్‌షాపు నుంచి రూ. ఐదు లక్షల విలువైన 13 కిలోల వెండిని తరలించేందుకు వరంగల్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్ ఫాం-1కు చేరుకున్నారు. రబ్దిసాగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కుతుండగా అనుమానం వచ్చిన పోలీసులు వారి బ్యాగు తనిఖీ చేశారు. అందులో 13 కిలోల ముడి వెండి ఉంది. బిల్లులు లేకుండా వెండిని తరలిస్తున్న వారిద్దరినీ అదుపులోకి తీసుకుని, వెండిని స్వాధీనం చేసుకున్నారు. వెండిని కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అప్పగించినట్లు జీఆర్పీ సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు