వడదెబ్బతో 13 మంది మృతి 

1 May, 2018 01:57 IST|Sakshi
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఆరుగురు మృత్యువాత 

సాక్షి, నెట్‌వర్క్‌:  వడదెబ్బతో సోమవారం 13 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఆరుగురు మృతిచెందారు. వైరా మండలం రెబ్బవరానికి చెందిన  నాగేశ్వరరావు, చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన భారతమ్మ, బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలకు చెందిన ఏలయ్య, పాల్వంచకు చెందిన తవిటినాయుడు, కూసుమంచి మండలం బోడియాతండాకు చెందిన  చినరాములు, కొత్తగూడెంలోని రామ వరం పద్మశాలి బస్తీకి చెందిన శ్రీనివాస్‌ మృతిచెందారు.

సూర్యాపేట జిల్లాలో చివ్వెంలకు చెందిన ఇమామ్‌ సాహెబ్, అర్వపల్లికి చెందిన   వీరయ్య , మఠంపల్లి మండలం బక్కమంతులగూడేనికి చెందిన గోపయ్య, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌కు చెందిన కొండ లచ్చమ్మ, జమ్మికుంట మండలం విలాసాగర్‌కు చెందిన పద్మ, బుగ్గారం మండలం సిరికొండకు చెందిన పోచయ్య ఎండలకు తాళలేక ప్రాణాలొదిలారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట గ్రామంలో శివలక్ష్మి మృతి చెందింది.
 

మరిన్ని వార్తలు