డయేరియాతోనే 13 శాతం శిశు మరణాలు

29 Jul, 2015 23:41 IST|Sakshi

దోమ/పరిగి : ఐదేళ్ల లోపు శిశువులు, చిన్నపిల్లల మరణాల్లో 13 శాతం డయేరియా (నీళ్ల విరేచనాలు) వల్లే సంభవిస్తున్నాయని జిల్లా శిశు ఆరోగ్య, వ్యాధి నిరోధక టీకాల అధికారి (జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి) నిర్మల్ కుమార్ పేర్కొన్నారు. నీళ్ల విరేచనాలు కావడానికి గల కారణాలు, నివారణ మార్గాలపై ఆయన దోమ జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా పరిగి ఆస్పత్రిలో నిర్వహిస్తున్న ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ నీళ్ల విరేచనాల వల్ల శరీరంలో నీరు, లవణాల శాతం గణనీయంగా తగ్గిపోయి ప్రాణాంతక పరిస్థితి తలెత్తుతుందన్నారు.

దీనిని అరికట్టడం సులభమని, తగు జా గ్రత్తలతో ఇంటి వద్దే చికిత్స అందించే వీలుందన్నారు. విరేచనాల బారిన పడే చిన్నారులకు తల్లిపాలతో పాటు ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని తా గించాలని సూచించారు. జింక్ మాత్రలు వేయ డం ద్వారా విరేచనాలను నియంత్రించే వీలుం టుందన్నారు. పిల్లలు నలతగా, సుస్తీగా ఉండి తల్లి పాలను తాగకపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడడం లాంటి లక్షణాలు కనబడితే వెంటనే వైద్యుడి వద్దకు తీసుకువెళ్లాలని సూచించారు. పక్షోత్సవాల్లో భాగంగా మొదటి వారం గ్రామాల్లో వైద్య బృందం పర్యటించి ఐదేళ్లలోపు పిల్లలున్న ఇళ్లలో ఓఆర్‌ఎస్ ప్యాకె ట్లు, జింకు మాత్రలు అందజేస్తామని తెలిపా రు.

రెండో వారంలో తల్లులు పిల్లలకు పాలు పట్టే విధానం ఇతర జాగ్రత్తలపై శిక్షణ ఇస్తామన్నారు. పై కార్యక్రమాల్లో పీహెచ్‌సీ వైద్యాధికారి టీ కృష్ణ, గణాంకాధికారి కృష్ణ, సామాజిక ఆరోగ్య అధికారి కే బాలరాజు, ఆరోగ్య విస్తరణ అధికారి వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పురంధర దాస్, వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు