14 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తాం

1 Apr, 2015 03:25 IST|Sakshi

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తిరూరల్ : రానున్న నాలుగేళ్లలో పాలమూరు జిల్లాలోని 14లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. మంగళవారం రాజపేటలో ఆయన మహిళలకు వంటగ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  మిషన్ కాకతీయ పథకంలో భాగంగా గ్రామాల్లోని చెరువులను మరమ్మతు చే సేందుకు ప్రభుత్వం పూనుకుందన్నా రు. వచ్చే ఖరీఫ్ నాటికి ప్రస్తుతం టెండర్లు పూర్తయిన చెరువులకు మరమ్మతులు చేసి 3లక్షల ఎకరాలకు నీరందిం చేందుకు మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులకు ప్రభత్వం ఆదేశాలు జారీ చేసిం దన్నారు.

అలాగే మరో సంవత్సర కా లంలో మరిన్ని చెరువులను మరమ్మతు చేసి మరో 4లక్షల ఎకరాలకు నీరిచ్చే వి ధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుం టుందన్నారు. నాలుగో సంవత్సరంలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తిచేసి 7 లక్షల ఎకరాలకు నీరందిస్తామని, 2019 ఎన్నికల నాటికి పాలమూరు జిల్లాలో 14లక్షల ఎకరాలకు సాగునీరందించి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బి. లక్ష్మయ్య, మాజీ వైస్ ఎంపీపీ లోకారెడ్డి, కౌన్సిలర్ శ్రీధర్,  మండల టీఆర్‌ఎస్ నాయకులు వెంకటయ్య, మాణిక్యం, కురుమూర్తి, బీచుపల్లి యాదవ్, తిలక్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు