రూ.350 కోట్లతో 1400 కొత్త బస్సులు

27 Oct, 2016 20:30 IST|Sakshi
రూ.350 కోట్లతో 1400 కొత్త బస్సులు

మరో 236 మినీ బస్సులు
ప్రతి జిల్లా కేంద్రంలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు
రవాణశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి


పరిగి: రాష్ట్రంలో రవాణా శాఖను పటిష్టం చేస్తామని ఆ శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో గురువారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. త్వరలో రూ. 350 కోట్లతో 1,400 బస్సులు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. మరో 236 మినీ బస్సులు.. వీటిలో 100 ఏసీ బస్సులు కొనుగోలు చేసి డిపోలకు అందజేస్తామన్నారు. రూ. 17 కోట్లతో సిరిసిల్లలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

ప్రతి జిల్లా కేంద్రంలో శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రూ.30 కోట్లతో రాష్ట్రంలో ఆర్టీఏ సొంతభవనాలు నిర్మిస్తామని రవాణ శాఖ రాష్ట్ర కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. ప్రతి ఆర్టీఏ కార్యాలయంలో ట్రాక్‌లు ఉండేలా చూస్తామన్నారు. గతంలో ఎక్కువ శాతం ఆర్టీఏ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగగా ప్రస్తుతం ముమ్మరంగా కొత్త భవనాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు