టీఎస్‌ జెన్‌కోలో కొత్తగా 148 పోస్టులు

16 Nov, 2019 02:59 IST|Sakshi

డెప్యుటేషన్‌ ప్రాతిపదికన భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (టీఎస్‌జెన్‌కో)లో కొత్తగా 148 పోస్టులను సృష్టిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. డెప్యుటేషన్‌పై వీటి భర్తీకి అవకాశమిచ్చారు. ఈ ఉద్యోగులను హోంశాఖ నుంచి స్థానికత ఆధారంగా తీసుకునేలా ఆ శాఖకు సూచించారు. ఇందులో ఒక డీఎస్పీ, 10 అసిస్టెంట్‌ కమాండెంట్, ఒక సివిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (సివిల్‌), 11 ఇన్‌స్టెక్టర్‌ (రిజర్వ్‌), ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఎస్‌ఐ), 13 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (సివిల్‌), 36 హెడ్‌ కానిస్టేబుల్, 31 పోలీస్‌ కానిస్టేబుల్, 44 మహిళా కానిస్టేబుల్‌ పోస్టులున్నాయి.

టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌కు ఒక ఇన్‌స్పెక్టర్‌ పోస్టు 
దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌) ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఏర్పాటు చేయనున్న విద్యుత్‌ చౌర్యం నిర్మూలన పోలీస్‌ స్టేషన్‌లో డెప్యుటేషన్‌ ప్రాతిపదికన భర్తీ చేసేలా ఒక పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ (సివిల్‌) పోస్టును సృష్టిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. హోంశాఖ అనుమతితో ఈపోస్టు భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా