దున్నపోతుకు వినతి పత్రం.. వినూత్న నిరసన

19 Oct, 2019 11:52 IST|Sakshi

సాక్షి, బాన్సువాడ : బాన్సువాడలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం 14వ రోజుకు చేరింది. సమ్మె శిబిరం వద్ద కార్మికులు కోలాటం ఆడి నిరసన  తెలిపారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీజీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి  కోనాల గంగారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల నాయమైన డిమాండ్లను పరిష్కారించాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 14 రోజులు కావస్తున్న సీఎం  పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అని అన్నారు.

అందుకే దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశామన్నారు, ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు ఖలీల్, సుదీర్, సంగమేశ్వర్, హన్మండ్లు, రాజాసింగ్, అశ్వీన్, సోను, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ గిరిధర్, కో కన్వీనర్లు మల్లయ్య, బసంత్, శంకర్, లక్ష్మణ్, నాగరాజ్, జీఎస్‌. గౌడ్, యాదుల్లా, మూర్తి, కౌ సర్, సాయిలు, చంద్రకాంత్, ప్రశాంత్‌రెడ్డి, రా ధ, సవిత, విమల, లక్ష్మీ, శ్యామల ఉన్నారు. శనివారం తలపెట్టిన తెలంగాణ బంద్‌కు ప్రజలు సహకరించాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ గిరిధర్‌ అన్నారు. శుక్రవారం బాన్సువాడలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. వ్యాపారస్తులకు బంద్‌కు సహకరించాలని విన్నవించారు. బంద్‌కు బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సీఐటీయూ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు పూర్తిగా మద్దతు తెలుపుతున్నాయని ఆయన అన్నారు.  

మరిన్ని వార్తలు