అప్పు తీర్చాల్సి వస్తుందని.. అంతమొందించాడు

14 Apr, 2016 02:24 IST|Sakshi
అప్పు తీర్చాల్సి వస్తుందని.. అంతమొందించాడు

15రోజుల్లోనే  కేసును ఛేదించిన  పోలీసులు
నిందితుడి అరెస్టు, రిమాండ్

 
 అయిజ : అప్పు తీర్చాల్సి వస్తుందని ఏకంగా యజమానినే ఓ వ్యక్తి తుదముట్టించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసును 15రోజుల్లో ఛేదించి ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ వివరాలను బుధవారం గద్వాల డీఎస్పీ బాలకోటి, సీఐ సురేష్, ఎస్‌ఐ రమేష్ అయిజ పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. పులికల్‌కు చెందిన కె.చంద్రశేఖర్ (40) మూడేళ్లుగా అయిజ పట్టణంలో రెస్టారెంట్ నిర్వహించేవారు. అందులో కర్నాటక రాష్ట్రం రాయిచూర్ జిల్లా ఉప్పలపాడుకు చెందిన చరణబస్వ అలియాస్ చరణ్ వంటమనిషిగా పనిచేసేవాడు.

సుమారు ఆరునెలల క్రితం గల్లాపెట్టెలోని రూ.1.6లక్షలు దొంగలించాడు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో దీనిపై పంచాయితీ పెట్టిస్తే  రూ.1.1లక్షలు మాత్రమే ఇస్తానని అంగీకరించాడు. అలాగే గతంలో అప్పుగా తీసుకున్న రూ.42వేలు కలిపి ఉగాది పండగ వరకు చెల్లిస్తానన్నాడు. అయితే యజ మానిని తుదమిట్టిస్తే ఆ డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఉండదని పథకం పన్నా డు.

అందులోభాగంగా గత నెల 30వ తేదీ అర్ధరాత్రి భరత్‌నగర్‌కాలనీలోని ఇంటి మిద్దెపై ఒంటరిగా నిద్రిస్తున్న చంద్రశేఖర్‌ను కత్తితో పొడిచి చంపేసి పారిపోయాడు. ఈ ఘటనపై మరుసటిరోజు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టగా ఈ విషయం బయటపడింది. నిందితుడు చరణ్‌ను బుధవారం అరెస్టు చేసి గద్వాల కోర్టుకు రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు