నకిలీ కరెన్సీ కేసులో 15 మందికి ఐదేళ్ల జైలు

20 Feb, 2015 02:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) 2012లో గుట్టురట్టు చేసిన నకిలీ కరెన్సీ రాకెట్ కేసులో 15 మందిని దోషులుగా నిర్ధారిస్తూ నాంపల్లి కోర్టు గురువారం తీర్పు చెప్పింది. వారికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది. ఈ రాకెట్‌కు పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాకు చెందిన మోర్జాన్ హోసేన్ కీలక సూత్రధారి. నకిలీ నోట్లను పాక్‌లో ముద్రించి బంగ్లాదేశ్ మీదుగా దేశంలోని పలు ప్రాంతాలకు ఏజెంట్ల ద్వారా హోసేన్ చెలామణిలోకి తెచ్చాడు. దీన్ని గుర్తించిన ఎన్‌ఐఏ 2012లో పశ్చిమ బెంగాల్‌లో హోసేన్‌ను అరెస్టు చేసింది. అతడిచ్చిన సమాచారంతో 30 మందిని పట్టుకుంది.

మరిన్ని వార్తలు