-

అష్ట దిగ్బంధంలోకి ఆ 15 ప్రాంతాలు..

9 Apr, 2020 17:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా వైరస్‌ కట్టడి కోసం ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలకు ఉపక్రమించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదైనా 12ప్రాంతాలను ఇప్పటికే కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా గుర్తించి సంగతి తెలిసిందే. తాజాగా రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలోని మూడు ప్రాంతాలను కూడా ఆ జాబితాలో చేర్చారు. ఆ ప్రాంతాలకు రాకపోకలు ఆపేసి అష్ట దిగ్బంధం చేయనున్నారు. ప్రతి ఇంటిని సర్వే చేయనున్నారు. ఈ ఏరియాల్లో ప్రతి ఇంటిని వైద్య ఆరోగ్యశాఖ సంబంధిత అధికారులు తనఖీ చేస్తారు. సర్వేలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్టు తేలితే వారిని ఆస్పత్రికి తరలిస్తారు. వైరస్‌ సోకివారిని ఐసోలేషన్‌ లేదా నిర్బంధ కేంద్రానికి తరలించనున్నారు. (ఆపరేషన్ మర్కజ్.. ట్రాన్స్ మిషన్ 12)

ఆ ఏరియాల్లోని ప్రతి వీధిని శుభ్రంగా ఊడ్చి, క్రమం తప్పక క్రిమి సంహారకాలు పిచికారీ చేస్తారు. క్లసర్లలోని ప్రజలకు అవసరమైన నిత్యావసరాలకు తగిన ఏర్పాట్లు చేస్తారు. క్లస్టర్లలో పోలీసు అధికారులు రాకపోకల్ని నిరోధిస్తారు. దాదాపుగా ‘కార్డన్‌ ఆఫ్‌’ అమలు చేస్తారు. ఈ క్లస్టర్ల పరిధిలోని ప్రజల రాకపోకలపై ప్రత్యేక నిఘా ఉంటుంది. కాగా, గత నెలలో ఢిల్లీ వెళ్లివచ్చినవారు కేవలం హైదరాబాద్‌ జిల్లాలోనే 593 మంది ఉన్నారు. వారిలో 83 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వారి ద్వారా మరో 51 మందికి కరోనా వ్యాపించింది. వేర్వేరు మార్గాల్లో మరో 70 మందికి సోకింది. వీరందరి నివాస ప్రాంతాలను అధికారులు ప్రభుత్వ యాప్‌ జియోట్యాగ్‌ చేస్తున్నారు. బుధవారం నాటి హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని మొత్తం 659 మంది నివాసాలకు అధికారులు జియోట్యాగ్‌ చేశారు. (మర్కజ్ భయం.. చైన్ తెగేనా!)


కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా గుర్తించిన ప్రాంతాలు.. 
1) రాంగోపాల్‌పేట 
2) షేక్‌పేట్‌ 
3) రెడ్‌హిల్స్‌ 
4) మలక్‌పేట్, సంతోష్‌నగర్‌ 
5) చాంద్రాయణగుట్ట 
6) అల్వాల్‌ 
7) మూసాపేట 
8) కూకట్‌పల్లి 
9) కుత్బుల్లాపూర్, గాజులరామారం 
10) మయూరీనగర్‌ 
11) యూసుఫ్‌గూడ 
12) చందానగర్‌ 
13) బాలాపూర్‌
14) చేగూరు
15) తుర్కపల్లి

చదవండి : న‌య‌మైన రోగుల‌కు మ‌ళ్లీ క‌రోనా!

మరిన్ని వార్తలు