రేషన్‌ తీసుకోని వారికి రూ.1,500 సాయం నిలిపివేత

27 Apr, 2020 05:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు వరుసగా కనీసంగా 4.50 లక్షల మంది లబ్ధిదారులు కార్డు ఉండికూడా రేషన్‌ తీసుకోవడం లేదని పౌరసరఫరాల శాఖ గుర్తించింది. వారికి ప్రభుత్వం తరఫున అందిస్తున్న రూ.1,500 సాయాన్ని నిలిపివేసింది. దీనిద్వారా పౌర సరఫరాల శాఖకు రూ.67 కోట్ల మేర మిగులు వచ్చింది. రాష్ట్రంలో 87.54 లక్షల కుటుంబాలు ఉండగా, 3 నెలలుగా రేషన్‌ తీసుకోని కుటుంబాల సంఖ్య ఒక్కో నెల ఒక్కోలా ఉంది. కాగా, రేషన్‌కార్డుదారుల కుటుంబాలకు కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నెలకు రూ.1,500 ఆర్థికసాయాన్ని అందిస్తోంది.

తొలి విడతలో 74లక్షల మందికి, రెండో విడతలో 5.21 లక్షల మందికి పంపిణీ చేస్తోంది. మూడో విడతలో మరో 3లక్షల మందికి రూ.45 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం కాగా, మరో లక్ష కుటుంబాలకి బ్యాంకు ల్లో డబ్బులు వేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కుటుంబాలన్నీ పోనూ మరో 4.50 లక్షలమంది కుటుంబాలు పూర్తిగా రేషన్‌ తీసుకోనివే. వీరికి రూ.1,500 ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. రేషన్‌ బియ్యం వీ రి కి అవసరం లేనప్పుడు ప్రభుత్వ సాయం అనవసరమనే భావిం చాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ అధికారి ఒకరు వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు