ఇరాక్‌లో ఇరుక్కుపోయారు!

1 Dec, 2019 02:32 IST|Sakshi

16 మంది తెలంగాణవాసుల నరకయాతన

జన్నారం: ఉపాధి కరువై.. బతుకు బరువై డబ్బులు సంపాదించుకోవచ్చనే ఆశతో విదేశాలకు వెళ్లిన తెలంగాణవాసులు అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. జన్నారం మండలం సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది వరకు పనులు లేక పస్తులుంటున్నారు. తమను స్వదేశానికి రప్పించాలని వారు వేడుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ధర్మారం గ్రామానికి చెందిన జాడి చంద్ర య్య గతేడాది వెళ్లి పనుల్లేక ఇబ్బందులు పడుతున్నాడు. కవ్వాల్‌ గ్రామానికి చెందిన కుంటాల నర్సయ్య, సేర్ల లచ్చన్న రెండేళ్ల క్రితం ఇరాక్‌ వెళ్లారు. ఏదో కారణంగా 3 నెలలుగా వారు జైలు పాల య్యారు.  వీరంతా  ఏజెంట్ల మోసాలకు గురై  ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం
‘‘ఇరాక్‌లో ఇబ్బంది పడుతున్న తెలంగాణవాసుల గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాం. ఎన్‌ఆర్‌ఐ బిభాగం కార్యదర్శి చిట్టిబాబు దృష్టికి తీసుకెళ్లాం. వారిని త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. ’’
మాటేటి కొమురయ్య, గల్ఫ్‌ వెల్ఫేర్‌,అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

మరిన్ని వార్తలు