16 ఎంపీ సీట్లు గెలిచి సత్తా చాటుతాం  

20 Mar, 2019 14:44 IST|Sakshi
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి వినతిపత్రం ఇస్తున్న దివ్యాంగుడు రాజేష్‌

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి 

సాక్షి, దుబ్బాకటౌన్‌: తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఎదురు లేదని, పార్లమెంటు ఎన్నికల్లో 16 సీట్లు గెలిచి తమ సత్తా చాటుతామని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. మంగళవారం దుబ్బాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఏలా ఉన్నా తెలంగాణలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్‌లు గెలిచే పరిస్థితుల్లో లేవన్నారు. తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో ఎంఐఎం ఓక చోట మిగతా 16 పార్లమెంటు స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంటుందన్నారు.

కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు జంకుతున్నారన్నారు. దేశం కోసం సైనికులు ప్రాణాలు అర్పిస్తే వారి త్యాగాలతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయాలు చేయడం దారుణమన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా మోదీ ప్రభుత్వం జాతీయహోదా ఇవ్వకపోవడం దారుణమన్నారు. కేంద్రంలో టీఆర్‌ఎస్‌ క్రీయాశీలకపాత్ర.. దేశంలో ఏ పార్టీకి అధికారంలోకి వచ్చే సరిపడ మోజార్టీ వచ్చే పరిస్థితులు కనబడడం లేదన్నారు. 16 ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో కేసీఆర్‌ చక్రం తిప్పుతాడన్నారు.

టీఆర్‌ఎస్‌ కేంద్రంలో కీలక భూమిక పోషించబోతుందన్నారు. రాజేష్‌ కుటుంబానికి అండగా ఉంటాం.. దుబ్బాక పట్టణానికి చెందిన దివ్యాంగుడైన రాజేష్‌ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే రామలింగారెడ్డి హామీనిచ్చారు. రాజేష్‌ కుటుంబానికే డబుల్‌ బెడ్రూం ఇండ్లలో మొదటి ఇల్లు ఇస్తామని హామీనిచ్చారు. ఈ సమావేశంలో దుబ్బాక టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ అధ్యక్షులు ఆస స్వామి, మహిళ విభాగం అధ్యక్షురాలు దాత్రిక నారాయణ భాగ్యలక్ష్మీ, నాయకులు రొట్టె రమేష్, అస్క రవి, లచ్చపేట నర్సింహులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు