ఒక్క నెలలోనే 185 టీఎంసీలు

31 Aug, 2018 00:58 IST|Sakshi

సాగర్‌ను ఆదుకున్న ఆగస్టు

ప్రస్తుత నీటిమట్టం 582 అడుగులు, 288 టీఎంసీల నిల్వ  

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులను ఆగస్టు నెల పూర్తిగా ఆదుకుంది. ఈ నెలలో వచ్చి న ప్రవాహాలతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండగా, నాగార్జునసాగర్‌ దాదాపు నిండింది. ఈ నెలలో సాగర్‌లోకి 185 టీఎంసీలకు పైగా నీరు వచ్చింది. మరో 8 అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టానికి చేరుకోనుంది. ఎగువ శ్రీశైలం నుంచి స్థిరంగా ప్రవాహాలు కొనసాగు తుండటంతో సాగర్‌కు గురువారం సాయంత్రం 73వేల క్యూసెక్కుల మేర వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 590 అడుగులకు గానూ 582 అడుగులకు చేరింది. నీటినిల్వ 312 టీఎంసీలకు గానూ 288 టీఎంసీలను దాటింది. మరో 24 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండుకుండను తలపిం చనుంది.

రెండు రోజులతో పోలిస్తే శ్రీశైలం నుంచి ప్రవాహాలు తగ్గినా, అవి మళ్లీ క్రమంగా పుంజు కునే అవకాశం కనిపిస్తోంది. ఎగువ కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్‌లకు నీటి ప్రవాహాలు క్రమంగా పెరిగాయి. గురువారం ఆల్మట్టిలోకి లక్ష క్యూసెక్కుల వరద వస్తుండగా 1.35 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక నారాయణపూర్‌ నుంచి 1.38 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ జూరాలకు విడుదల చేశారు.

దీంతో ఉదయం జూరాలకు 80 వేల క్యూసెక్కుల వరద కొనసాగగా, అది సాయంత్రానికి లక్ష క్యూసెక్కులకు పెరిగింది. దీంతో దిగువ శ్రీశైలానికి జూరాల నుంచి 1.31 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గురువా రం ఉదయం శ్రీశైలానికి కేవలం 29 వేల క్యూసెక్కుల వరద రాగా, సాయంత్రానికి 1.02 లక్షల క్యూసెక్కులకు చేరింది. సాగర్‌కు 73,344 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండగా, శుక్రవారం   మరింత పెరిగే అవకాశం ఉంది. సాగర్‌ నుంచి ఏపీ, తెలంగాణ అవసరాలకు 28,744 క్యూసెక్కు ల నీటిని సాగు, తాగుకు విడుదల చేస్తున్నారు.

మరిన్ని వార్తలు