1,86,17,091 మంది ఓటేశారు!

15 Apr, 2019 03:34 IST|Sakshi

పురుషులు 93,73,320 మంది.. మహిళలు 92,42,193 మంది

మూడు స్థానాల్లో మహిళా ఓటర్లదే పైచేయి..

ఇందూరు ఫలితాలను నిర్దేశించనున్న మహిళా ఓటర్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో మొత్తం 2,96,97,279 మంది ఓటర్లకు గాను 1,86,17,091 (62.69 శాతం) మంది ఓటేశారు. 1,49,19,751 మంది పురుష ఓటర్లలో 93,73,320 (62.82శాతం) మంది, 1,47,76,024 మంది మహిళా ఓటర్లలో 92,42,193 (62.55శాతం) మంది, 1,504 మంది ఇతర (ట్రాన్స్‌జెండర్‌) ఓటర్లలో 232(15.43శాతం) మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల్లో పురుషుల కంటే మహిళల పోలింగ్‌ అధికంగా నమోదు కావడంతో ఇక్కడి ఫలితాలు ఆసక్తికరంగా మారనున్నాయి. మిగిలిన 14 లోక్‌సభ స్థానాల్లో పురుష ఓటర్లే స్వల్ప ఆధిక్యతను సాధించారు. రాష్ట్రస్థాయిలో సగటున స్త్రీ, పురుషుల ఓటింగ్‌ నిష్పత్తి సమానంగా నమోదు కావడం గమనార్హం.  

ఇందూరులో పోటెత్తిన మహిళా ఓటర్లు  
నిజామాబాద్‌ స్థానంలో మొత్తం 10,61,124 ఓట్లు పోలవ్వగా, అందులో 4,73,673 మంది పురుషులు, 5,87,447 మహిళలు, నలుగురు ఇతరులున్నారు. పురుషుల ఓటింగ్‌ 64.22 శాతం, మహిళల ఓటింగ్‌ 72.06 శాతం నమోదైంది. పురుషుల కంటే 1,13,774 మహిళా ఓట్లు అధికంగా పడ్డాయి. ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున సిట్టింగ్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, బీజేపీ నుంచి ధర్మవురి అరవింద్‌ పోటీలో ఉన్నారు.

ఈ స్థానంలో అభ్యర్థుల గెలుపోటములను మహిళా ఓటర్లే నిర్దేశించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసిన రైతన్నలు మూకుమ్మడిగా నామినేషన్లు వేయడంతో, నిజామాబాద్‌ నుంచి పోటీ చేస్తున్న మొత్తం అభ్యర్థుల సంఖ్య 185కు పెరిగిన విషయం తెలిసిందే. కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో 5,58,352 (68.49%) మంది పురుషులు, 5,88,108 (70.38%) మంది మహిళలు ఓటేయడంతో ఇక్కడి ఫలితాలు సైతం ఆసక్తికరంగా మారాయి. మే 23న లోక్‌సభ ఎన్నికల ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నడిరోడ్డుపై హత్య చేసి తలతో పోలీస్‌ స్టేషన్‌కి..

​​22న కేసీఆర్‌ చింతమడక పర్యటన

ఎంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు

ఈనాటి ముఖ్యాంశాలు

‘అర్హులందరికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు’

నాపై దాడి చేసింది ఆయనే : జబర్దస్త్‌ వినోద్‌

ఎగిరే పార్టీకాదు.. నిలదొక్కుకునే పార్టీ..

‘మేఘా’ పై జీఎస్టీ దాడులు అవాస్తవం

అతి పెద్ద డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కాలనీ

కరీంనగర్‌ మున్సిపల్‌ ఎన్నికకు బ్రేక్‌

సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని..

‘హరిత’ సైనికుడు

‘జబర్దస్త్‌’ ఆర్టిస్ట్‌ వినోదినిపై దాడి.. గాయాలు

లైట్‌ జాబా.. అయితే ఓకే

‘కేఎంసీ తెలంగాణకే తలమానికం’

‘దేశంలో రూ. 2016 పెన్షన్‌ ఇస్తున్నది కేసీఆర్‌ మాత్రమే’

ఈ కాలేజ్‌లకు లెక్చరర్లే లేరు!

దౌల్తాబాద్‌లో భార్యపై హత్యాయత్నం

ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన వారు కూడా నేరస్తులే 

హైదారాబాద్‌ బస్సు సర్వీసులపై అభ్యంతరం

దోపిడీ దొంగల హల్‌చల్‌! 

లక్కోరలో మహిళ దారుణ హత్య 

పురుగులమందు పిచికారీకి ఆధునిక యంత్రం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ కనుమరుగు

‘బీ–ట్రాక్‌’@ గ్రేటర్‌

సీతాకోక చిలుకా.. ఎక్కడ నీ జాడ?

ఫ్లోరైడ్‌ బాధితుడి ఇంటి నిర్మాణానికి కలెక్టర్‌ హామీ

మరింత ఆసరా!

పైసా వసూల్‌

పురుగుల అన్నం తినమంటున్నారు..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మంచు వారింట్లో సీమంతం సందడి

సైమా...షురూ...

అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌

‘ఆమె ఆరోపణలతో తలెత్తుకోలేక పోతున్నాం’

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా?