ప్రెస్‌కౌన్సిల్‌లో 19 కేసుల విచారణ పూర్తి

15 Mar, 2017 02:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా వివిధ వార్తా పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై అందిన ఫిర్యాదులపై ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా విచారణ చేపట్టింది. ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌ ప్రసాద్‌ అధ్యక్షతన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సభ్యులు మంగళవారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో సమావేశమయ్యారు. మొత్తం 39కేసులపై విచారణ చేపట్టిన కౌన్సిల్‌ 19 కేసులపై విచారణను పూర్తిచేసింది. ఆధారాలున్న కేసులకు బాధ్యులకు సమన్లు జారీచేయడంతో పాటు, ఆధారాలు లేని కేసులను డిస్మిస్‌ చేసింది. మిగిలిన 20 కేసులను బుధవారం విచారించనుంది. పరిష్కరించిన వాటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, కేరళ రాష్ట్రాలకు చెందిన కేసులు ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కార్యదర్శి విభా భార్గవ, సభ్యులు ఉత్తమ్‌ చంద్ర శర్మ, ప్రకాశ్‌దూబే, ప్రభాత్‌కుమార్, రాజీవ్‌ రంజన్‌నాగ్, ఎస్‌ఎన్‌ సిన్హా, ప్రజానంద చౌదరి, రవీంద్రకుమార్, సోందీప్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు