ఎయిర్‌పోర్ట్‌లో 2.7 కేజీల బంగారం పట్టివేత

7 May, 2015 23:51 IST|Sakshi

శంషాబాద్ : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు వేర్వేరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు 2.7 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. గురువారం ఉదయం బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతడి  లగేజీ నుంచి 2.3 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

 అదే సమయంలో కౌలాలంపూర్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి లోదుస్తుల్లో 400 గ్రాముల బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు