2,775 మంది చిన్నారుల ముఖాల్లో ‘స్మైల్‌’

3 Feb, 2017 01:51 IST|Sakshi
2,775 మంది చిన్నారుల ముఖాల్లో ‘స్మైల్‌’

ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌: తప్పిపోయిన చిన్నారులు, వీధిబాలల సంరక్షణ లో భాగంగా చేపట్టిన ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తం గా 2,775 మంది చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు నింపిం ది. మహి ళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  పలు శాఖల సహకారం తో జనవరి 1 నుంచి 31 వరకు రాష్ట్రంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షెల్టర్లు తదితర ప్రాంతాల్లో ‘స్మైల్‌’ బృందాలు పర్యటించాయి. తప్పిపోయిన, ఒంటరిగా కనిపించిన 2,775 మంది చిన్నారులను చేరదీశాయి.

వీరిలో 2,169 మంది బాలురు, 606 మంది బాలికలు న్నారు. బాలల నుంచి వివరాలను ఆరా తీసిన అధికారులు.. రాష్ట్రానికి చెందిన 2,671 మంది చిన్నారులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కర్ణాటక, మధ్య ప్రదేశ్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళ నాడు రాష్ట్రాలకు చెందిన మరో 104 మందిని సైతం సొంతవూర్లకు పంపేందుకు చర్యలు చేపట్టారు. కుటుంబ సభ్యు లకు అప్పగించిన వారు మినహా మిగతా చిన్నారులకు స్టేట్‌ హోం లలో వసతి కల్పించారు.

యాదాద్రిలో అత్యధికంగా..
ఆపరేషన్‌ స్మైల్‌లో భాగంగా గుర్తించిన చిన్నారుల్లో అత్యధికంగా యాదాద్రి జిల్లాకు చెందినవారు ఉన్నారు. యాదాద్రిలో 398 మంది, తర్వాత హైదరాబాద్‌ జిల్లాలో 344 మంది చిన్నారులను గుర్తించారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్‌ జిలా ్లల్లోనూ ఎక్కువ సంఖ్యలో చిన్నారులను అధికారులు గుర్తించారు. మూడేళ్లుగా చేపడుతున్న ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమంలో ఇప్పటివరకు 13,018 మంది చిన్నారులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు