అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ

2 Jul, 2018 09:42 IST|Sakshi
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న కొత్త శ్రీనివాస్‌రెడ్డి 

శంకరపట్నం(మానకొండూర్‌) : తెలంగాణలో మేం అధికారంలోకి వస్తే రైతులకు రూ.2లక్షల రుణ మాఫీ చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శంకరపట్నం మండలం కేశవపట్నం వ్యవసాయ సబ్‌ మార్కెట్‌లో ఆదివారం బీజేపీ బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మార్కెట్‌ ఆవరణలో నిర్వహించే సభాప్రాంగణాన్ని పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం పేదల ఒ క్కో ఇంటి నిర్మాణం కోసం రూ.1,55,000 రాష్ట్రానికి అందిస్తే.. ఒక్క డబుల్‌ బెడ్‌రూం నిర్మించలేదని ఆరోపించారు. వేల కోట్ల నిధులను తెలం గాణ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు.

ఫసల్‌బీమా రాష్ట్ర ప్రభుత్వం వైఖరితో ఎక్కువ సంఖ్యలో చేయలేదని మండిపడ్డారు, తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఈనెల 4న శంకరపట్నం మండలకేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో ఎండగడతామన్నా రు. సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, శాననసభాపక్ష నేత కిషన్‌రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ, సీనియర్‌ నాయకులు హాజరవుతారని చెప్పారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు అలివేలి సమ్మిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఇనకొండ నాగేశ్వర్‌రెడ్డి, గణపతి, ఉపాధ్యక్షుడు గుర్రాల వెంకటరెడ్డి, పార్లమెంట్‌ కన్వీనర్‌ చదువు రాజేందర్‌రెడ్డి, కార్యదర్శి వెంకట్‌రెడ్డి, నాయకులు సూదగోని శ్రీనివాస్, కోరెం శ్రీనివాస్‌రెడ్డి, దండు కొంరయ్య, పుట్టపాక సమ్మయ్య, చల్ల ఐలయ్య, నరేందర్, జైపాల్, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు