టార్గెట్‌.. సేంద్రియ సాగు

5 Jun, 2017 01:19 IST|Sakshi
టార్గెట్‌.. సేంద్రియ సాగు

2017–18 వ్యవసాయ ప్రణాళికలో లక్ష్యాల ప్రకటన
సన్నచిన్నకారు రైతుల్లో వ్యవసాయ యంత్రాల ప్రోత్సాహం


సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా సేంద్రియ వ్యవసాయాన్ని రాష్ట్రంలో ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులను చైతన్యపరచాలని యోచిస్తోంది. ఈ సీజన్‌లో ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలను 2017–18 ప్రణాళికలో వ్యవసాయశాఖ వెల్లడించింది. త్వరలో విడుదల కానున్న ఆ ప్రణాళిక అనేక లక్ష్యాలను ప్రకటించింది. సేంద్రియ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే సన్నచిన్నకారు రైతుల్లో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలని స్పష్టం చేసింది. అందుకోసం 2017–18లో రూ. 436 కోట్లు కేటాయించింది.

కింది అంశాలపై ఫోకస్‌...

భూసార పరీక్ష కేంద్రాల బలోపేతం. ప్రతీ ఏవో పరిధిలో మినీ భూసార పరీక్ష కేంద్రం ఏర్పాటు.

గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి రైతు సమాఖ్యల ఏర్పాటు.

పంటల ఉత్పత్తి టెక్నాలజీని వ్యవసాయ సిబ్బందికి తెలియజేస్తారు.

సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులనే పండిస్తా రు. అందుకు రైతులను సన్నద్ధం చేస్తారు.

 పంట రుణాలను బ్యాంకుల ద్వారా అందిం చే ఏర్పాటు.

ఇంటర్నెట్‌ను వినియోగించుకుని ఎరువులు, విత్తనాల సరఫరా, మార్కెటింగ్‌ విధానాల ను తెలియపరుస్తారు.

4.5 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు
ఈ ఏడాది వానాకాలం, యాసంగిలకు కలిపి 10 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేయాలని వ్యవసాయశాఖ తన లక్ష్యంగా పేర్కొంది. దీని కోసం ప్రభుత్వం రూ. 176.15 కోట్లు కేటాయించింది. అలాగే వానాకాలంలో 16.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు, యాసంగిలో 12 లక్షల మెట్రిక్‌ టన్నులను సరఫరా చేయాలని నిర్ణయించారు.

మరిన్ని వార్తలు