ఆ..మూడు స్థానాలపై!

30 May, 2018 07:57 IST|Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పైచేయి సాధించేందుకు అధికార టీఆర్‌ఎస్‌ ముందస్తుగానే కసరత్తు మొదలు పెట్టింది. పూర్వపు జిల్లాలోని పన్నెండు స్థానాల్లో  ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ చేతిలో ఎనిమిది (రెండు స్థానాలు చేరి కల ద్వారా వచ్చినవి) నియోజకవర్గాలు ఉండగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ చేతిలో మరో నాలుగు స్థానాలు ఉన్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీఎల్పీ ఉపనేతగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండడంతో గులాబీ అధిష్టానం కూడా ఈ జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెబుతున్నారు.

దీనిలో భాగంగానే, గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన చోట కొత్త అభ్యర్థుల కోసం అన్వేషణ మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. పార్టీ గుర్తుతో గెలిచిన సూర్యాపేట, ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, అదే విధంగా చేరికల ద్వారా పార్టీ గూటికి చేరిన మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేల స్థానాల్లో మార్పులు ఉండవని, సిట్టింగులకే ఈసా రి అవకాశమూ ఖాయమన్నది పార్టీ వర్గాల సమాచారం. గత సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండనుంచి పోటీచేసి ఓడిపోయిన దుబ్బాక నర్సింహా రెడ్డి మూడేళ్లకుపైగా పార్టీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించా రు.

ఆయన స్థానంలో టీడీపీనుంచి పార్టీలో చేరిన కంచర్ల భూపాల్‌రెడ్డికి ఇన్‌చార్జ్‌ ఇవ్వడంతో, టికెట్‌ హామీ మీదనే ఆ బాధ్యతలు ఇచ్చారన్నది స్పష్టమైంది. ఈ స్థానంనుంచి బరిలోకి దిగే అభ్యర్థి విషయంలోనూ ఎలాంటి వివాదం లేదని అంటున్నా రు. ఇక, మిగిలిన కోదాడ, హూజూర్‌నగర్, నాగా ర్జునసాగర్‌  నియోజకవర్గాల్లో పోటీకి పెటాల్సిన నేతల గురించి మూడు రోజుల క్రితం చర్చ జరి గిందని సమాచారం. సీఎం కేసీఆర్‌ తనయు డు, మంత్రి కేటీఆర్‌.. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర సీనియర్‌ నాయకులతో చర్చించారని తెలిసింది.

మూడు చోట్ల పోటాపోటీ !

నాలుగు నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌ ఇన్‌చా ర్జులు ఉన్నారు. కానీ, ఆయా స్థానాల్లో కొత్త నాయ కత్వం ఉనికిలోకి రావడంతో ఈసారి టికెట్‌ కోసం పోటీ పెరిగిందని చెబుతున్నారు. ఈ పోటీ చివరకు పార్టీలో గుంపులను తయారు చేసింది. కోదా డలో గత ఎన్నికల్లో శశిధర్‌రెడ్డి పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయనే నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మె ల్యే వేనేపల్లి చందర్‌రావు టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరడంతో గ్రూపులు మొదలయ్యాయి. ముందునుంచీ పార్టీలో కొనసాగుతున్న శశిధర్‌రెడ్డి మంత్రి జగదీశ్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. మరోవైపు హుజూర్‌నగర్‌లో శంకరమ్మ పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఇక్కడ కొత్తగా మరో నాయకుడు ఎన్‌ఆర్‌ఐ సైదిరెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. ఆయన కూడా మంత్రికి ప్రధాన అనుచరుడిగా పేరుంది. అదే మాదిరిగా నాగార్జునసాగర్‌ నియోజకవర్గం తరఫున సీపీఎం నుంచి చివరి నిమిషంలో టీఆర్‌ఎస్‌లో చేరి పోటీచేసిన నోముల నర్సిం హయ్య ఓటమిపాలయ్యారు.

ప్రస్తుతం ఆయనే ఇక్కడ పార్టీకి ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఇక్కడినుంచే పార్టీ నాయకుడు ఎంసీ కోటిరెడ్డి కూడా టికెట్‌ కో సం ప్రయత్నిస్తున్నారు. ఆయనా మం త్రికి దగ్గరి అనుచరుడిగా ఉన్నారు. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లో పార్టీలో రెండు వర్గాలు కనిపిస్తున్నా యి. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పోటీకి దిగబోయేది ఎవరనే విషయం కేడర్‌కు స్పష్టంగా తెలియకపోతే సమస్య అవుతుందని పార్టీ నాయకత్వం భావించిందని చెబుతున్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకునే మూ డు రోజుల కిందట మంత్రి కేటీఆర్‌ జిల్లా నాయకులతో చర్చించారని అంటున్నారు. ఈ హుజూర్‌నగర్, కో దాడల్లో ఎన్‌ఆర్‌ఐ సైదిరెడ్డి, శశిధర్‌రెడ్డిలకు లింకు పెట్టారని ఎవరో ఒకరికే అవకాశం ఉంటుం దని సూచాయగా చెప్పారని తెలిసింది.

నాగార్జునసాగర్‌ విషయంలోనూ ఆ స్థానానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా, బలంగా ప్రాబల్యం చూపగల సా మాజిక వర్గానికి చెందిన నాయకుడికే అవకాశం ఇవ్వాలన్న చర్చ కూడా జరిగినట్లు సమాచారం. మొత్తం గా నల్లగొండ సహా నాలుగు స్థానాల్లోకే సామాజిక వర్గానికి చెందిన నాయకులకు టికెట్లు ఇస్తే, బీసీ లకు ప్రాతినిధ్యం కల్పిం చడం కష్టమన్న చర్చ జరి గిందని, అందుకే కోదా డ, హుజూర్‌నగర్‌లకు లింకుపెట్టారని అంటున్నారు. ఈ వ్యవహారంలో మరో రెండు మూడు భేటీలు జరిగాక కానీ మరిం త స్పష్టత రాదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.   

మరిన్ని వార్తలు