రెండు రోజులు.. 237 డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు

9 Sep, 2019 10:15 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో ప్రత్యేక డ్రంకన్‌డ్రైవ్‌ తనిఖీల్లో 237 మందిపై ట్రాఫిక్‌ పోలీసులు కేసులు నమోదుచేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కారు. వీరిలో 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నవారు 106 మంది, 31 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్నవారు 83 మంది, 41 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నవారు 29 మంది, 51 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్నవారు 12 మంది, 18 నుంచి 20 ఏళ్ల మధ్య ఉన్నవారు నలుగురు, 61 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్నవారు ముగ్గురు ఉన్నారు. వాహనాల వారీగా కేసులను పరిశీలిస్తే అత్యధికంగా 157 బైక్‌లు, 62 ఫోర్‌వీలర్స్, 16 త్రీవీలర్స్, రెండు లారీలు.. మొత్తం 257 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ ఎస్‌.విజయ్‌కుమార్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు