సమగ్ర కుటుంబ సర్వే-2014కు ఇంకా 24 గంటలు

18 Aug, 2014 01:43 IST|Sakshi

 ప్రగతినగర్: సమగ్ర కుటుంబ సర్వే-2014కు ఇంకా 24 గంటల సమయం మాత్రమే మిగిలింది. మంగళవారం జరిగే ఈ సర్వేలో జిల్లాలోని 6.25 లక్షల కుటుంబాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నమోదు చేయనున్నారు. ఇందుకోసం దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పది విభాగాలలో 80 అంశాలపై వివరాలు సేకరించనున్నారు. ప్రతి గ్రామానికి ఒక రూట్ ఆఫీసర్‌ను నియమించారు. వీరు మంగళవారం ఉదయం మెటీరియల్‌తో కూడిన కిట్ బ్యాగులను ఎన్యూమరేటర్లకు అందించనున్నారు. సర్వే కోసం 27,500 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2,300 మంది ప్రయివేటు ఉపాధ్యాయులు, 800 మంది బ్యాంకు సిబ్బందిని వినియోగించనున్నారు.

 వీరందరికి జిల్లాలోని 56 కేంద్రాలలో రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. ప్రతి మండలాన్ని నాలుగు జోన్లుగా విభజించారు. ఇంటింటికి కరపత్రా లు పంపిణీ చేశారు. స్టిక్కర్లను అతికించారు. గ్రామాలలో పోస్టర్లు వేశారు. మండల ప్రత్యేకాధికారులు సర్వే కు బాధ్యులుగా వ్యవహరించనున్నారు. సర్వే అనంత రం సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికి మండలానికి 25 నుంచి 50 వరకు కంప్యూటర్లను సిద్ధం చేస్తున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్ 25 నుంచి 30 ఇళ్ల సమాచారాన్ని సేకరించాలని సూచించారు.

మరిన్ని వార్తలు