పట్టణాల్లోనూ ఐటీ వెలుగులు

16 Jun, 2017 01:30 IST|Sakshi
పట్టణాల్లోనూ ఐటీ వెలుగులు

ఐటీ రంగంలో రాష్ట్రం ముందుకు దూసుకెళ్తోంది
ఖమ్మంలో 25 కోట్లతో ఐటీ హబ్‌కు శంకుస్థాపన చేశాం
ఖమ్మం బహిరంగసభలో ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్‌


సాక్షి, ఖమ్మం: ‘ఐటీ అంటే ఒకనాడు కేవలం హైదరాబాద్‌కే పరిమితం.. ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం కొత్త పుంతలు తొక్కుతోంది. వరంగల్‌లో ఐటీ ద్వారా వెయ్యికి పైగా ఉద్యోగాలు సైంట్‌ అనే కంపెనీ ద్వారా సాధిం చాం. ఇంకా చాలా కంపెనీలు అక్కడికి వస్తు న్నాయి.. ఖమ్మంలో ఈరోజు రూ.25 కోట్లతో ఐటీ హబ్‌కు శంకుస్థాపన చేసుకున్నాం.. ఏడు కంపెనీలకు భూమి కేటాయించాం. ఖమ్మంలో రాబోయే ఏడాదిన్నర కాలంలో ఐటీరంగంలో 2 వేల ఉద్యోగాలు రాబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు, ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా ఐటీ, ఇండస్ట్రీ, పారిశ్రామికీకరణ ద్వారా.. మీకు మీ ప్రాంతాల్లో.. ఇక్కడే ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం.

ఖమ్మంలో ఐటీహబ్‌ వచ్చేందుకు పట్టుబట్టిన ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ను అభినందిస్తున్నా ను.’అని ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఖమ్మంలో గురువారం కేటీఆర్‌తోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మహేం దర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి రూ.356 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా సర్దార్‌పటేల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ అధ్యక్షత వహిం చగా.. కేటీఆర్‌ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమ, అభి వృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తున్నా రన్నారు. కేంద్రం సహకారం లేకపోయినా, పక్కనే ఏపీ రాష్ట్రం అడ్డుపడుతున్నా.. తెలం గాణ వచ్చిన మూడేళ్ల స్వల్పకాలంలోనే అన్ని రంగాల్లో ముందుకుపోతున్నట్లు చెప్పారు.

ఏడు మండలాల్ని ఏపీలో కలిపిన కేంద్రం
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని, ఆంధ్రప్రదేశ్‌కు అండగా ఉండేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు గిరిజన మం డలాలను ఆనాడు కేంద్ర ప్రభుత్వం బల వంతంగా ఏపీలో కలిపిందని కేటీఆర్‌ అన్నారు. అసలే కొత్తగా ఏర్పడిన తెలంగాణలో విద్యుత్‌ సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. అతి చౌకగా కరెంటు లభించే లోయర్‌ సీలేరు ప్రాజెక్టును కూడా అక్కడ కలిపారన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొ న్నారు. కేంద్ర  స్టీల్, ఇంధనశాఖ మంత్రిని ఎన్నిసార్లు బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ విషయంపై కలిసినా స్పందన లేదన్నారు. విశాఖపట్నంలో ఏ ఉక్కు ఉందని, ఏ ఖనిజం ఉందని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారని ప్రశ్నించారు.

అక్కడకు పక్కనేఉన్న ఒడిషా నుంచి ముడిసరుకును తీసుకొస్తున్నారని, బయ్యారంలో ఉక్కు ఉన్నప్పటికీ.. 100 కిలో మీటర్లలోపు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బైలడిల్లాలో ఖనిజం ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో పెద్దఎత్తున ఉపాధి వచ్చే అవ కాశం ఉన్నా.. చట్టంలో మాట ఇచ్చినా, మీన మేషాలు లెక్కపెడుతున్నారని అన్నారు.  సభలో ఖమ్మం మేయర్‌ డాక్టర్‌ పాపాలాల్, ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతారాం నాయక్, జెడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, జలగం వెంకట్రావు, బానోతు మదన్‌లాల్, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పి.రవి పాల్గొన్నారు.

వామపక్షాలు లేవు.. దోమపక్షాలు లేవు..
‘ఖమ్మం జిల్లాలో ఈ రోజున వామపక్షాలు లేవు.. దోమపక్షాలు లేవని, అంతా ఏకపక్షంగా గులాబీ పక్షమైపోయింది’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఖమ్మం కార్పొరేషన్‌.. పాలేరు ఉప ఎన్నిక.. ఏ సందర్భం వచ్చినా కేసీఆర్‌ పక్షాన ప్రజలు నిలిచారన్నారు.

సెల్ఫీ యువరాజా..
ఖమ్మం అర్బన్‌: ఖమ్మం నగరవాసులకు ఆహ్లాదం పంచేందుకు లకారం చెరువును మిషన్‌ కాకతీయ పథకం ఫేస్‌–1లో భాగంగా సుందరీకరిస్తున్నారు. నగర పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ గురువారం లకారం చెరువు కట్ట మొత్తం కలియ తిరిగి పరిశీలిం చారు. చెరువుకు జలకళ సంతరించుకోవ డంతో చెరువు గట్టుపై నిలబడి తన మొబైల్‌ లో మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే అజయ్, ఎమ్మెల్సీ బాలసాని, మేయర్‌ పాపాలాల్, డిప్యూటీ మేయర్‌ మురళిలతో కలసి సెల్ఫీ తీసుకున్నారు.

మరిన్ని వార్తలు