27 నుంచి చతురాయతన మహాసౌరయాగం

9 Nov, 2014 00:32 IST|Sakshi

దేశంలోనే మొదటిసారి

వరంగల్: వరంగల్ ములుగు రోడ్ హనుమాన్ జంక్షన్ సమీపంలోని శ్రీ రమాసత్యనారాయణ స్వామి ఆలయంలో ఈ నెల 27 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు చతురాయతన మహాసౌరయాగం నిర్వహించనున్నట్లు పండితుడు జాగర్లపూడి వీరభద్రశర్మ తెలిపారు. ఈ మేరకు ఆలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. దేశంలోనే మొదటిసారిగా మహాసౌరయాగం నిర్వహిస్తున్నామని వివరించారు.

ప్రతి రోజు  ఉదయం నుంచి సాయంత్రం వరకు 12 మంది బ్రాహ్మణులతో త్రిచ, సౌర, అరుణ కేతుక సహిత  సూర్య నమస్కారాలు చేస్తారని వివరించారు. చివరి రోజు పూర్ణాహూతి కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన యూగానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
 

మరిన్ని వార్తలు