28 మందిని బలిగొన్న వడదెబ్బ

1 Jun, 2015 04:12 IST|Sakshi

మహబూబాబాద్ నియోజక వర్గంలో..
 మహబూబాబాద్/గూడూరు/మహబూబాబాద్‌రూరల్ : మానుకోట పట్టణంలోని హ న్మంతునిగడ్డకు చెందిన పుచ్చకాయల రాములు(58) శనివారం రాత్రి వడదెబ్బతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. గూడూరు మండల కేంద్రానికి చెందిన నాయూబ్రాహ్మణు డు ఎలమందల సురేందర్(36) వడదెబ్బతో ఆదివారం రాత్రి మృతిచెందాడు. మహబూబాబాద్ మండలం లక్ష్మీపురం(బ్రాహ్మణపల్లి) గ్రామానికి చెందిన గుంజె వెంకటమ్మ(52) శనివారం రాత్రి మృతిచెందింది.

 డోర్నకల్ నియోజకవర్గంలో నలుగురు..
 డోర్నకల్/నర్సింహులపేట/కురవి : డోర్నకల్ పట్టణంలోని స్థానిక న్యూ నెహ్రూస్ట్రీట్‌కు చెందిన జైనాబీ(92) వడదెబ్బ తగలడంతో అస్వస్థతకు గురై చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందింది. మండలంలోని పెరుమాళ్లసంకీస గ్రామానికి చెందిన కొత్త గోపయ్య మూడు రోజుల క్రితం వడదెబ్బకు గురై చికిత్స పొందుతున్నాడు. ఆదివారం పరిస్థితి విషమించడం తో మృతిచెందాడు. నర్సింహులపేట మండలంలోని వంతడపల గ్రామానికి చేందిన బానో తు సేవ్యా(40) ఆదివారం వడదెబ్బకు గురై మృతిచెందాడు. కురవి మండలంలోని కొత్తూరు(సీ) గ్రామానికి చెందిన దయ్యాల హుస్సేన్(57) అస్వస్థతకు గురయ్యాడు. స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చికిత్సపొందుతూ మృతిచెందాడు.

 స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఇద్దరు..
 లింగాలఘణపురం/ ధర్మసాగర్ : మండల కేంద్రంలో ఆదివారం గట్టగల్ల ఎల్లయ్య(42) వడదెబ్బతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ధర్మసాగర్ మండలంలోని క్యాతంపల్లి గ్రామానికి చెందిన శిఖ రాజు(36) వడదెబ్బతో ఆదివారం ఉదయం మృతిచెందాడు.

 ములుగు నియోజకవర్గంలో ఇద్దరు..
 ములుగు/ఏటూరునాగారం : ములుగు మండలంలోని దేవగిరిపట్నం గ్రామానికి చెందిన గేదెల కాపరి తేజావత్ సక్రు(60) వడదెబ్బకు గురై ఆదివారం మృతిచెందాడు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఓడవాడకు చెందిన బట్టు చిన్న లక్ష్మి(55) వడదెబ్బతో ఆదివారం ఉదయం మృతి చెందింది.

 హన్మకొండ మండలంలో ఇద్దరు..
 మడికొండ : హన్మకొండ మండలం కొండపర్తి గ్రామానికి చెందిన చీకటి బుచ్చమ్మ(75), మడికొండలో వలుగోజు సత్యనారాయణ(58) ఆదివారం వడదెబ్బతో మృతిచెందారు.

 నగరంలో ముగ్గురు..
 కాశిబుగ్గ/కరీమాబాద్ : కాశిబుగ్గ 5వ డివిజన్ రాములవారి వీధికి చెందిన నాయూ బ్రాహ్మణుడు మురహారి రాములు(54) వడదెబ్బకు గురై ఆదివారం మృతి చెందాడు. నగరంలోని రంగశాయిపేట కుంట్లవాడకు చెందిన జారతి లక్ష్మి(84) వడదెబ్బతో శనివారం రాత్రి మృతి చెందింది. అలాగే కరీమాబాద్ కటికవాడకు చెందిన ఎండీ అబ్జల్‌బీ(60) కూడా వడదెబ్బ తో మృతిచెందింది.

 నర్సంపేట నియోజకవర్గంలో నలుగురు..
 నల్లబెల్లి: నల్లబెల్లి మండలంలోని ముచ్చింపులకు చెందిన గడ్డమీది సమ్మయ్య(80), నందిగామకు చెందిన పొరిక తావురు(65) వడదెబ్బకు గురై మృతిచెందారు. నెక్కొండ మండల కేంద్రానికి చెందిన ఎడ్ల గౌరమ్మ(71) వడదెబ్బతో శనివారం రాత్రి వరంగల్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మండలంలోని తోపనపల్లి గ్రామానికి చెందిన చొప్పడి వీరారెడ్డి(70) వడగాలి తగలడంతో మృతిచెందాడు.

 భూపాలపల్లి నియోజకవర్గంలో ముగ్గురు..
 శాయంపేట/రేగొండ/చిట్యాల : మండలంలోని మాందారిపేట గ్రామానికి చెందిన అల్లం అమృతమ్మ (70) ఆదివారం వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రేగొండ మడలంలోని భాగిర్తిపేట గ్రామానికి చెందిన వెల్పుకొండ రాజమల్లమ్మ(65) వడదెబ్బతో మృతిచెందింది. చిట్యాల మండలంలోని వెలిశాల గ్రామ శివారు కిష్టయ్యపల్లి గ్రామానికి చెందిన బిరుద ప్రభాకర్(50) వడదెబ్బతో ఆదివారం మృతిచెందాడు.

 పరకాలలో ఐదుగురు..
 పరకాల/సంగెం/గీసుకొండ : పరకాల పట్టణానికి చెందిన బొచ్చు సమ్మయ్య(60) అస్వస్థతకు గురై మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మండలంలోని రాయపర్తి గ్రామానికి చెందిన రాసమల్ల రాయమల్లమ్మ(55) పత్తి కట్టెలు ఏరేందుకు వెళ్లి వడదెబ్బ తాకి మృతిచెందింది. నాగారం గ్రామానికి చెందిన గండ్రకోట రాజయ్య(40) మేకల కాయడానికి వెళ్లి మృతిచెందాడు. సంగెం గ్రామానికి చెందిన పుట్ట వీరలక్ష్మి(87) ఇంట్లోనే వడదెబ్బకు సోకి ఆదివారం మృతిచెందింది. గీసుకొండ మండలంలోని నందనాయక్‌తండా గ్రామపంచాయతీ శివారు సింగ్యా తండాకు చెందిన బాదావత్ బీక్యానాయక్(60) వడద్బెతో చనిపోయూడు.

>
మరిన్ని వార్తలు