28,29 తేదీల్లో కృష్ణా నీళ్లు బంద్‌

26 Aug, 2019 11:00 IST|Sakshi

పైపులైన్‌కు భారీ లీకేజీయే కారణం..

సాక్షి, సిటీబ్యూరో: కృష్ణా తాగునీటిపైప్‌లైన్‌కు భారీ లీకేజీ ఏర్పడడంతో ఈనెల 28, 29 తేదీల్లో పలుప్రాంతాలకు మంచినీటి సరఫరా ఉండదని జలమండలి ప్రకటించింది. బండ్లగూడ వద్ద కృష్ణా ఫేజ్‌–1కు సంబంధించి 2200 ఎంఎం డయా వ్యాసార్థం గల భారీ తాగునీటి పైపులైన్‌కు భారీ లీకేజీ ఏర్పడడంతో రెండురోజుల పాటు మరమ్మతులు చేపట్టనున్నారు. దీంతో ఈనెల 28 (బుధవారం) ఉదయం 6 గంటల నుంచి 29 (గురువారం)  సాయంత్రం 6గంటల వరకు మొత్తం36 గంటలపాటు మంచినీటి సరఫరా నిలిచిపోనుంది. 

28న మంచినీటి సరఫరానిలిచిపోయే ప్రాంతాలివే..
అలియాబాద్, మిరాలాం, కిషన్‌బాగ్, రియాసత్‌ నగర్, సంతోష్‌ నగర్,వినయ్‌ నగర్, సైదాబాద్, ఆస్మాన్‌ ఘడ్, చంచల్‌గూడ, యాకుత్‌పుర, మలక్‌పేట్, మూసారాంబాగ్, బొగ్గులకుంట,అఫ్జల్‌గంజ్, హిందీనగర్, నారాయణ గూడ, అడిక్‌ మెట్, శివం, చిలకలగూడ, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదు.

ఈనెల 29న నీళ్లు బంద్‌ ఇక్కడే..
భోజగుట్ట, మారేడ్‌ పల్లి, సైనిక్‌ పురి పరిసర ప్రాంతాలు.

మరిన్ని వార్తలు