స్కాంపై ఏసీబీ ప్రశ్నల వర్షం

10 Oct, 2019 05:11 IST|Sakshi

ఉక్కిరిబిక్కిరైన దేవికారాణి, పద్మ 

ప్రత్యేక ప్రశ్నావళితో నిందితులను వేర్వేరుగా విచారించిన ఏసీబీ

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సరీ్వసెస్‌ (ఐఎంఎస్‌) కుంభకోణంలో నిందితులను ఏసీబీ బుధవారం విచారించింది. విచారణ సందర్భంగా ఏసీబీ అధికారులు సంధించిన ప్రశ్నలకు దేవికారాణి, పద్మ ఇతర సభ్యులు ఉక్కిరిబిక్కిరి అయ్యారని సమాచారం. ఈ కుంభ కోణంలో ముఖ్య నిందితులందరినీ విచారణకు అప్పగించాలని ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్‌ మేరకు న్యాయస్థానం రెండు రోజుల కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే.

దీంతో బుధవారం ఉదయం నిందితులందరినీ చంచల్‌గూడ జైలు నుంచి మాజీ డైరెక్టర్‌ దేవికారాణి, మాజీ జేడీ పద్మలతోపాటు మాజీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వసంత ఇందిర, మాజీ ఫార్మాసిస్ట్‌ రాధిక, మాజీ సీనియర్‌ అసిస్టెంట్‌ హర్షవర్ధన్, ఓమ్ని ఫార్మా ప్రతినిధి శివనాగరాజు, ఓమ్ని ఫార్మా ఎండీ శ్రీహరిలను బంజారాహిల్స్‌లోని ప్రధాన కార్యాలయానికి తరలించారు. వీరందరినీ వేర్వేరుగా విచారించారు. అందరికీ ప్రత్యేక ప్రశ్నావళిని ముందే సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా దేవికారాణి, పద్మలు ఏసీబీ అధికారుల ప్రశ్నల ధాటికి ఉక్కిరిబిక్కిరి అయి సరిగా సమాధానం చెప్పలేదని సమాచారం.  

తొలిరోజు కీలక సమాచారం..
మందుల కొనుగోళ్లకు సంబంధించి జీవో నం.51 ని ఎందుకు అమలు చేయలేదు? మందుల టెండ ర్లకు నోటిఫికేషన్‌ ఎందుకివ్వలేదు? రిజిస్టర్డ్‌ కంపెనీలను (ఆర్‌సీ) కాదని నాన్‌రిజిస్టర్డ్‌ కంపెనీ (ఎన్‌ఆర్‌సీ)లకు మందుల కొనుగోళ్లు ఎందుకు కట్టబెట్టాల్సి వచి్చంది? నిబంధనలను ఎందుకు పాటిం చలేదు? కార్యాలయంలో ప్రైవేటు ఫార్మా కంపెనీల వ్యక్తుల ఇష్టారాజ్యం, వారితో సంబంధాలు, బ్యాంకు ఖాతాలు, ఇతర ఆస్తులకు సంబంధించి విషయాలపై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. దేవికారాణి, పద్మలు పలు సమాధానాలు దాటివేసేందుకు ప్రయత్నించినా.. ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా సాక్ష్యాలను ముందుపెట్టేసరికి పలుమార్లు తెల్లముఖం వేసినట్లు సమాచారం. తొలిరోజు చాలా కీలకమైన విషయాలకు సంబంధించిన ముఖ్య సమాచారాన్ని ఏసీబీ రాబట్టగలిగినట్లు తెలిసింది. సాయంత్రం నిందితులందిరినీ తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు.  

విజిలెన్స్‌లోనూ ఇదే ధోరణి..
ఈఎస్‌ఐలో మందుల కొనుగోలుకు సంబంధించి దేవికారాణి, పద్మలు 2018, 2019లో విజిలెన్స్‌ విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో వీరు ఇచ్చిన సమాధానంతో విజిలెన్స్‌ సంతృప్తి చెందలే దు. చాలా నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పారని, ఉద్దేశపూర్వకంగా అవినీతికి పాల్పడ్డారని అనుమానించింది. వీరితోపాటు మరికొందరిపై శాఖాపరమైన చర్యలకూ సిఫార్సు చేసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా