మూడేళ్లలో 3వేల మంది రైతుల ఆత్మహత్య

19 Jun, 2017 18:46 IST|Sakshi
మూడేళ్లలో 3వేల మంది రైతుల ఆత్మహత్య

- రైతుల ఆత్మహత్యలపై హైకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌ ఆవేదన

పెద్దపల్లి జిల్లా: రాష్ట్రం‍లో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై హైకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన మూడేళ్లలో పంట దెబ్బతిని మూడువేల మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారిలో వంద కుటుంబాలకు కూడా ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదని హైకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లాకేంద్రంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఫసల్‌ బీమా పథకం ద్వారా ఎంతమంది రైతులకు పరిహారం అందించారని ఆయన ప్రశ్నించారు. మిర్చి, కందులు పండించిన రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. ప్రభుత్వమే మద్దతు ధరలను ప్రకటించి అదనంగా క్వింటాల్‌కు రూ. వెయ్యి నుంచి 2 వేల వరకు చెల్లించి, ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మంలో మద్దతు ధర కోసం ఆందోళనకు దిగిన మిర్చి రైతులను కటకటాలపాలు చేయడం అన్యాయమన్నార

మరిన్ని వార్తలు