టీచర్ల బదిలీలకు 30 వరకు దరఖాస్తులు

28 Jun, 2015 02:24 IST|Sakshi
టీచర్ల బదిలీలకు 30 వరకు దరఖాస్తులు

సవరణలతో షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలు, హేతుబద్ధీకరణ, పదోన్నతులకు దరఖాస్తుల గడువును పాఠశాల విద్యాశాఖ ఈ నెల 30 వరకు పొడిగించింది. ఈ మేరకు శనివారం సవరణ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఉప విద్యాశాఖాధికారికి సమర్పించవచ్చు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ అనంతరం ఈనెల 29లోగా యాజమాన్యాలు, కేటగిరీలు, సబ్జెక్టులు, మాధ్యమాల వారీగా ఖాళీల వివరాలను ఉప విద్యాశాఖాధికారి కార్యాలయంలో, జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతారు. జూలై 1, 2 తేదీల్లో దరఖాస్తు ఫారాల(హార్డ్ కాపీలు)ను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో స్వీకరిస్తారు.
 
 బదిలీల కోసం ప్రొవిజనల్ సీనియారిటీ, ఎన్‌టైటిల్‌మెంట్ పాయింట్లు, పదోన్నతుల కోసం సీనియారిటీ జాబితా, హేతుబద్ధీకరణ ద్వారా గుర్తించిన మిగులు టీచర్ల వివరాల జాబితాలను జూలై 3న జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో, వెబ్‌సైట్లో పెడతారు. బదిలీలు, ప్రమోషన్ల సీనియారిటీ జాబితాల్లో అభ్యంతరాలను జూలై 4న తగిన ఆధారాలతో డీఈవో కార్యాలయంలో సమర్పించవ చ్చు. 6న తుది సీనియారిటీ జాబితాను ప్రకటిస్తారు. 7న జెడ్పీ స్కూళ్ల హెచ్‌ఎంలకు జిల్లా స్థాయిలో, ప్రభుత్వ పాఠశాలల పరిధిలో పనిచేసే హెచ్‌ఎంలకు జోనల్ స్థాయిలో బదిలీలు ఉంటాయి. అన్ని సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్లు, అన్ని మాధ్యమాల ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంల బదిలీలు జూలై 9 నుంచి 11 వరకు జరుగుతాయి. ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు జూలై 12న, ఎస్జీటీల బదిలీలు 13 నుంచి 16 వరకు జరగనున్నాయి.
 

మరిన్ని వార్తలు