సార్వత్రిక బరిలో 329మంది

12 Apr, 2014 23:44 IST|Sakshi
సార్వత్రిక బరిలో 329మంది

సాక్షి, రంగారెడ్డి జిల్లా : సార్వత్రిక సమరంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. శుక్ర, శనివారాల్లో కొనసాగిన నామినేషన్ల ఉపసంహరణలో రెండు పార్లమెంటు స్థానాలకు నామినేషన్లు వేసిన ఏడుగురు పోటీ నుంచి తప్పుకున్నారు. అదేవిధంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 77 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో పార్లమెంటు స్థానాలకు 45 అభ్యర్థులు బరిలో నిలవగా, అసెంబ్లీ స్థానాలకు 284 మంది పోటీపడుతున్నారు.
 
 ఇక ప్రచార పర్వం..
నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ప్రచార పర్వం మొదలైంది. బరిలో ఉన్నదెవరో తేలిపోవడంతో అభ్యర్థులు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ప్రస్తుతం కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్ నియోజకవర్గాల్లో పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో అధికంగా 29 మంది బరిలో ఉన్నారు. ఆ తర్వాత ఉప్పల్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. అయితే పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో అతితక్కువగా తొమ్మిది మంది అభ్యర్థులున్నారు.
 
తప్పుకున్న ప్రముఖులు
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన కాంగ్రెస్ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి ఎట్టకేలకు శనివారం ఉపసంహరించుకోవంతో అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి ఊపిరి పీల్చుకున్నారు. శేరిలింగంపల్లిలో టీడీపీ పార్టీనేత మువ్వాసత్యనారాయణ, జగదీశ్వర్‌గౌడ్ ఇరువురు కూడా సమరం నుంచి తప్పుకోవడంతో పార్టీ నేతల్లో నెలకొన్న గందరగోళానికి తెరపడింది. చేవెళ్ల పార్లమెంటుకు నామినేషన్ వేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్ కూడా పోటీ విరమించుకున్నారు.
 
 నియోజకవర్గాల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థులు..
 మేడ్చల్    19
 మల్కాజిగిరి    23
 కుత్బుల్లాపూర్    23
 కూకట్‌పల్లి    29
 ఉప్పల్    27
 ఇబ్రహీంపట్నం    26
 ఎల్‌బీనగర్    29
 మహేశ్వరం    21
 రాజేంద్రనగర్    23
 శేరిలింగంపల్లి    21
 చేవెళ్ల    13
 పరిగి    9
 వికారాబాద్    12
 తాండూరు    9
 పార్లమెంటు నియోజకవర్గం
 మల్కాజిగిరి    30
 చేవెళ్ల    15

మరిన్ని వార్తలు