పెరిగిన ‘విద్యుత్‌’ వ్యయం!

16 Dec, 2017 04:16 IST|Sakshi

వచ్చే ఏడాది సరఫరాకు రూ.35,714 కోట్ల ఖర్చు 

ఈఆర్సీకి వార్షిక నివేదిక సమర్పించిన డిస్కంలు

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ సరఫరా వ్యయం ఏటికేటికి పెరిగిపోతోంది. వచ్చే ఏడాది (2018–19) రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా కోసం రూ.35,714 కోట్లు అవసరమని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు తాజాగా నివేదించాయి. ఇందులో విద్యుత్‌ కొనుగోళ్లకే రూ.27,903 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. శుక్రవారం 2018–19కి సంబంధించి వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్‌ఆర్‌)ను డిస్కంలు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలికి సమర్పించాయి. వచ్చేఏడాది రాష్ట్రంలో అమలు చేసే విద్యుత్‌ చార్జీల పట్టిక లేకుండా ఈ ప్రతిపాదనలు సమర్పించడంతో 2018–19లో రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలు పెరుగుతాయా లేక యథాతథంగా ఉంటాయా అన్న అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది. గతేడాదిలాగే చార్జీల వివరాలను మరికొన్ని రోజుల తర్వాత ఈఆర్సీకి డిస్కంలు ప్రత్యేకంగా ప్రతిపాదించను న్నాయి. అప్పుడే చార్జీల పెంపుపై స్పష్టత రానుంది. 2019లో జరిగే ఎన్నికల నేపథ్యం లో విద్యుత్‌ చార్జీలు పెంచొద్దని సీఎం కేసీఆర్‌ డిస్కంలను ఆదేశించినా.. డిస్కంలు చార్జీల అంశాన్ని సస్పెన్స్‌లో పెట్టడం గమనార్హం.  

యూనిట్‌కు రూ.6.42 వ్యయం..
డిస్కంలు సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరాకు సగటున యూనిట్‌కు రూ.6.42 వ్యయం కానుంది. 2018–19 కోసం డిస్కంలు 67,573 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఒప్పందాల రూపంలో ముందస్తుగా సమీకరించి పెట్టుకోగా.. వాస్తవ విద్యుత్‌ డిమాండ్‌ 64,291 మిలియన్‌ యూనిట్లే ఉండనుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు