ప్రాణాలు పోతున్నా..  పట్టించుకోరా ?

14 Nov, 2019 09:58 IST|Sakshi

 ప్రభుత్వం, సీఎం తీరుపై ఆర్టీసీ కార్మికుల ఆగ్రహం

40 రోజులకు చేరుకున్నఆర్టీసీ సమ్మె 

సాక్షి, కామారెడ్డి : తమ న్యాయమైన డిమాండ్‌ల కోసం పోరాటం చేస్తూంటే సీఎం, ప్రభుత్వం స్పందించకపోవడంతో మనోవేధనకు గురై కార్మికులు ప్రాణాలు కోల్పొతున్నారని అయినా పట్టించుకోవడం లేదని సీఎంపై ఆర్టీసీ కార్మికులు ధ్వజమైత్తారు. తమ డిమాండ్‌లను పరిష్కరించాలని చేపడుతున్న ఆర్టీసి కార్మికుల సమ్మె బుధవారంతో 40 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ, మావనహారం నిర్వహించారు. సమ్మె శిభిరం వద్ద మహభూబబాద్‌లో మృతి చెందిన ఆర్టీసి డ్రైవర్‌ నరేష్‌ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్టీసి జేఏసి నాయకులు వీ.దేవిదాస్, ఖదీర్, హరినాథ్, కృష్ణమూర్తి, రాజు, రాజేందర్, లత తదితరులు పాల్గొన్నారు.    

బోధన్‌: న్యాయమైన డిమాండ్లను పరిష్కరించా లని, ఆర్టీసీని కాపాడాలనే డిమాండ్లతో చేపట్టిన సమ్మెకు గ్రామస్థాయి నుంచి సకల జనులను సమాయత్తం చేద్దామని వామపక్ష పార్టీలు, ఆర్టీసీ జేఏసీ జిల్లా ప్రతినిధులు అన్నారు. ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 40వ రోజుకు చేరింది. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు బోధన్‌లోని అంబేడ్కర్‌ చౌరస్తాలో మహిళా కండక్టర్లు, కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం 11నుంచి సాయంత్రం వరకు దీక్షలు కొనసాగించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం సమ్మె పట్ల మొండి వైఖరితో ఉందని, ఆర్టీసీని ప్రైవేటీకరించి, ఆస్తులను కొల్లగొట్టెందుకే ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపాలని డిమాండ్‌ చేశారు.  దీక్షా శిబిరాన్ని ఐఎఫ్‌టీయు రాష్ట్ర అధ్యక్షుడు వనమాల క్రిష్ణ, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు కంజర భూమయ్య, రమేష్‌బాబు, సబ్బాని లత, నూర్జాహాన్, తెలంగాణ జేఏసీ జిల్లా కన్వీనర్‌ బాస్కర్, వామపక్ష పార్టీల నాయకులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మి కులు తదితరులు పాల్గొన్నారు. 

జిల్లాకేంద్రంలో.. 
ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): జిల్లాకేంద్రం లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం 40వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆ ర్టీసీ కార్మికులకు మద్దతుగా వామపక్షాలు, ప్ర జా సంఘాల నాయకులు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. వారిలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, రాజన్న, ఏఐఎస్‌ఎఫ్‌ కార్యదర్శి రఘురాం, స్వరూపరాణి, నవీ న్, రంజిత్, సుమన్, మారుతి, ఎల్లయ్య, సాయి లు, రాజు, తదితరులు ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా