397 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

9 Aug, 2014 02:56 IST|Sakshi

కురవి : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించి 397 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. కురవి మండలంలోని అయ్యగారిపల్లి గ్రామంలో 197 క్వింటాళ్లు, మరిపెడలో 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన కిరాణ షాపు యజమాని  చెరివిరాల ప్రవీణ్ రేషన్ బియ్యూన్ని లబ్ధిదారుల నుంచి అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నాడు. గ్రామంలోనేగాక చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కిరాణం షాపుల్లో కొనుగోలు చేసిన రేషన్ బియ్యూన్ని ఆటోల్లో అయ్యగారిపల్లికి తరలిస్తున్నాడు. అలా కొనుగోలు చేసిన బియ్యూన్ని గ్రామంలోని పలుచోట్ల నిల్వ చేశాడు. పక్కా సమాచారంతో విజి లెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు నిర్వహించ గా 394 సంచుల్లో 197 క్వింటాళ్ల రేషన్ బియ్యం లభ్యమైంది.

పంచనామా అనంతరం స్వాధీనం చేసుకున్న రేషన్ బియూన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించి, వాటిని మొగిలిచర్లలోని నవ్య రైస్‌మిల్లుకు తరలిం చారు. వ్యాపారి సీహెచ్.ప్రవీణ్‌పై 6ఏ కింద కేసు నమోదు చేస్తామని, అతడిని జేసీ కోర్టుకు అప్పగించనున్నట్లు ఆయన వివరించారు. దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఖమ్మం సీఐ వెంకటేశ్, హెడ్ కానిస్టేబు ల్ వెంకట్‌రెడ్డి, కానిస్టేబుల్‌మాధవరావు పాల్గొన్నారు.  
 
మరిపెడ : గూడూరు మండలం మునుగోడు నుంచి లారీలో 200 క్వింటాళ్ల రేషన్ బియ్యూన్ని అక్రమంగా కోదాడకు తరలిస్తున్నారనే సమాచారంతో విజిలెన్‌‌స అండ్ ఎన్‌ఫోర్‌‌సమెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో స్థానిక రాజీవ్‌గాంధీ సెంటర్‌లో లారీని ఆపి డ్రైవర్‌ను ప్రశ్నించగా మొక్కజొన్నల లోడుగా చెబు తూ ధ్రువపత్రాలు చూపించాడు.

అనుమానం వచ్చి అధికారులు బస్తాలు తనిఖీ చేయగా అందులో ప్రజాపంపిణీ బియ్యం రవాణా అవుతున్నట్లు తేలింది. దీంతో మునుగోడు వ్యాపారి నాగేశ్వరరావు, కోదాడకు చెందిన మేడి మల్లయ్యతోపాటు ఆయన గుమస్తా నారాయణ, లారీడ్రైవర్‌పై 6ఏ కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. సమావేశంలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ సీఐలు రమణారెడ్డి, వెంకటేష్, ఎంఆర్‌ఐ జర్పుల సుధాకర్‌నాయక్, డీటీ సురేష్‌బాబు ఉన్నారు.
 
అక్రమార్కులను వదిలేది లేదు
 
రేషన్ బియ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులను వదిలేది లేదని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల కాలంలో మహబూబాబాద్‌లో రెండు ట్యాంకర్లలో సుమారు 25 వేల లీటర్ల కిరోసిన్‌తోపాటు నాలుగు వాహనాల్లో సుమారు వెయ్యి క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నట్లు తెలిపారు. ప్రజలు కూడ తమ గ్రామాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను తమ దృష్టికి తీసుకరావాలని ఆయన కోరారు.
 

మరిన్ని వార్తలు