4జీ టెక్నాలజీతో ఆరోగ్యమైన పంటలు

12 Aug, 2014 03:50 IST|Sakshi
4జీ టెక్నాలజీతో ఆరోగ్యమైన పంటలు
  • ఐకార్ డెరైక్టర్  జనరల్ ఎస్. అయ్యప్పన్
  • మాదాపూర్:  4జీ టెక్నాలజీతో ఆరోగ్యకరమైన పంటలు సాధ్యమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ అన్నారు. మాదాపూర్ హెచ్‌ఐసీసీలో ఆదివారం రాత్రి ప్రతిష్ట ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన 4జీ నానో టెక్నాలజీ వ్యవసాయ ఎరువులను మార్కెట్‌లోకి విడుదలజేశారు.

    ముఖ్యఅతిథిగా ఐకార్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్  టెక్నాలజీని అధిగమించి వ్యవసాయ రంగం నాలుగవతరం 4జీ నానో టెక్నాలజీని సాధించడం ప్రపంచ వ్యవసాయరంగానికి శుభసూచకమన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసె ర్చ్ ఐదున్నరేళ్ళ పాటు పరిశోధించి ప్రపంచవ్యాప్తంగా 170 పరిశోధనశాలలో పరీక్షించిన ఈ 4జీ నానో ఫార్ములాతో ప్రతి ష్టా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అగ్రికల్చర్ ఇన్‌పుట్స్ (ఎరువులు) రూపొందించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

    ప్రస్తుతం పవర్ ఆఫ్ టెక్నాలజీగా పేర్కొంటున్న నానో టెక్నాలజీని వ్యవసాయరంగం సాధించడం ప్రపంచ వ్యవసాయ రంగంలో కీలకమైన మలుపని అన్నారు. ప్రతిష్టా ఇండస్ట్రీస్ లిమిటెడ్ 4జీ నానో వ్యవసాయ ఎరువులను మార్కెట్లోకి విడుదల చేయడం టెక్నాలజీని ఆర్థికరంగానికి మరియు వ్యవసాయ రంగానికి అత్యంత అందుబాటులోకి తీసుకువెళ్ళడమే అవుతుందన్నారు. వ్యవసాయ దారులు ఎవరో అందించే ఆర్థిక ప్రోత్సాహకాలపై అంత మక్కువగా లేరని, వారికి అనువైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకెళితే వ్యవసాయదారులే ఆర్థిక శక్తులుగా ఎదుగుతారని పేర్కొన్నారు.

    ఈ సందర్భంగా ప్రతిష్టా ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూపొందించిన 4జీ నానో వ్యవసాయ ఎరువులను ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ విలియం ధార్ మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ ఎరువులను నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ మార్కెట్‌లోకి తీసుకువెళ్తుంది. ఈ సందర్భంగా ప్రతి ష్టా కంపెనీ లోగోను, పుస్తకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిష్టా ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ కేవీఎస్‌ఎస్ సాయిరాం, ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ విలియం ధార్, ఆంధ్రబ్యాంక్ డీజీఎం వెంకటేశ్వర్లు, మాజీ న్యాప్ నేషనల్ డెరైక్టర్ డాక్టర్ రామారావు, శాస్త్రవేతలు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు