అటు విద్యుత్‌ సరఫరా.. ఇటు పునరుద్ధరణ!

22 Sep, 2017 00:31 IST|Sakshi
అటు విద్యుత్‌ సరఫరా.. ఇటు పునరుద్ధరణ!

సింగరేణికి రూ.కోటి నష్ట నివారణ

రామగుండం:  పెద్దపల్లి జిల్లా రామగుండంలోని మల్యాలపల్లి సబ్‌స్టేషన్‌కు చెందిన ట్రాన్స్‌కో ఇం జనీర్లు గురువారం మంచిర్యాల జిల్లా జైపూర్‌ (సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు)లో హాట్‌లైన్‌ పై పునరుద్ధరణ పనులు చేపట్టి రికార్డు సాధిం చడంతోపాటు కోటి రూపాయల నష్టాన్ని నివా రించగలిగారు. జైపూర్‌ విద్యుత్‌ కేంద్రంలో 400 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నుంచి గజ్వేల్‌కు సర ఫరా అయ్యే టెర్మినల్‌ టవర్‌ తీగలపై విద్యుత్‌ వలయాకారంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సింగరేణి ఎలక్ట్రికల్‌ డీజీఎం శ్రీనివాస్‌ గుర్తించి మల్యాలపల్లి ట్రాన్స్‌కో హాట్‌లైన్‌ సిబ్బందికి సమాచారమిచ్చారు. 

వీరిచ్చిన సమాచారం మేరకు స్పందించిన హాట్‌లైన్స్‌ ఏఈ రవి కుమార్‌ తన బృందంతో కలసి వెళ్లి సమస్యను పరిశీలించారు. సమస్యను పునరుద్ధరించాల్సి వస్తే సాధారణంగా విద్యుత్‌ సర ఫరాను నిలిపి వేయాల్సి ఉంటుంది. ఫలితంగా సింగరేణిలో బొగ్గు ఉత్ప త్తి ఆగిపోవడం తోపాటు ఇతరత్రా కలసి రూ. కోటి నష్టం వాటిల్లే అవ కాశం ఉందని ఉన్నతా ధికారులకు సమాచారం ఇచ్చారు. రూ.కోటి నష్ట నివారణకు హాట్‌లైన్లపై విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు నిర్ణయిం చారు. అమెరికా, బ్రెజిల్‌ నుంచి దిగు మతి చేసుకున్న ప్రత్యేక పరికరాలను హైదరాబాద్‌ నుంచి తెప్పించారు.

సదరు అధునాతనమైన పరికరాల సహాయంతో జైపూర్‌ విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి అవుతున్న క్రమం లోనే ప్రత్యేక రక్షణ కవచాలు ధరించి హాట్‌ లైన్లపై ఎక్కి సరఫరాకు అంతరాయం కలగ కుండా రెండు గంటలపాటు పునరుద్ధరణ పను లు చేపట్టారు. ఈ సమయంలో విద్యుత్‌ ఇంజ నీర్లు అప్రమత్తంగా వ్యవహ రించి, పునరు ద్ధరణ పనులు విజయవంతం చేశారు.  నష్టం వాటిల్లకుండా పనులు పూర్తి చేసిన ఇంజనీర్లను జైపూర్‌ విద్యుత్‌ అధికారులు ప్రశంసలతో ముంచెత్తారు. సమస్య ను గుర్తించిన సింగరేణి ఎలక్ట్రికల్‌ డీజీఎం శ్రీనివాస్‌తోపాటు హాట్‌లైన్స్‌ ఏఈ రవి కుమార్‌ను ఘనంగా సన్మానించారు. రవి కుమార్‌ బృందంలో   నీరజ్‌సింగ్, చంద్ర శేఖర్, కనకయ్య, సుదర్శన్, సంతోష్, ఆనంద్, శ్రీకాంత్, ఆనందం, ఓఅండ్‌ఎం నాగరాజు, దుర్గయ్య, వెంకటేశ్, చల్లాదురై ఉన్నారు.

మరిన్ని వార్తలు