వేసవిలో 445 ప్రత్యేక రైళ్లు 

24 Feb, 2019 04:15 IST|Sakshi

దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్‌ వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ మార్గాల్లో 445 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా సికింద్రాబాద్‌–కామాఖ్య (07149/07150) ప్రత్యేక రైలు మార్చి 1 నుంచి జూలై 1 వరకు వారానికి ఒకసారి రాకపోకలు సాగించనుంది. ఈ రైలు సికింద్రాబాద్‌లో ఉదయం 7.30కి బయలుదేరి రెండవ రోజు ఉదయం 8.20కి కామాఖ్య చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 5.42కి కామాఖ్య నుంచి బయలుదేరి రెండవ రోజు ఉదయం 9.15కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. హైదరాబాద్‌–జైపూర్‌ (02731/02732) ప్రత్యేక రైలు మార్చి 1 నుంచి జూన్‌ 30 వరకు రాకపోకలు సాగించనుంది. ఈ రైలు ప్రతి శుక్రవారం సాయంత్రం 4.20కి నాంపల్లి నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 5.25కి జైపూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు నాంపల్లి చేరుకుంటుంది.  

బరౌని, రెక్సాల్, కాకినాడ మార్గాల్లో.. 
- సికింద్రాబాద్‌–బరౌని (07009/07010) ప్రత్యేక రైలు మార్చి 3 నుంచి జూన్‌ 30 వరకు ప్రతి ఆదివారం రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి రెండవ రోజు ఉదయం 11.40కి బరౌని చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి బుధవారం ఉదయం 7.10కి బరౌని నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.40కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.  
సికింద్రాబాద్‌–రెక్సాల్‌ (07091/07092) ప్రత్యేక రైలు మార్చి నుంచి జూన్‌ వరకు ప్రతి మంగళవారం రాత్రి 9.40కి సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి గురువారం సాయంత్రం 6.15కి రెక్సాల్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12.45కి రెక్సాల్‌ నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 6.55కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. 
సికింద్రాబాద్‌–దర్భంగా (07007/07008) ప్రత్యేక రైలు మార్చి నుంచి జూన్‌ ఆఖరు వరకు ప్రతి నాలుగు రోజులకు ఒకసారి రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలు రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి రెండవ రోజు మధ్యాహ్నం 1.45కి దర్భంగా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 5 గంటలకు దర్భంగా నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.10కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.  
కాచిగూడ–కాకినాడ (07425/07426) ప్రత్యేక రైలు జూన్‌లో ప్రతి శుక్రవారం సాయంత్రం 6.45కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం సాయంత్రం 5.50కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.10కి కాచిగూడ చేరుకుంటుంది.  
కాచిగూడ–కృష్ణరాజపురం (07603/07604) ప్రత్యేక రైలు మార్చి నుంచి జూలై వరకు ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కృష్ణరాజపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి సోమవారం సాయంత్రం 3.25కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.55కి కాచిగూడ చేరుకుంటుంది.  
కాచిగూడ–టాటానగర్, కాచిగూడ–విశాఖపట్టణం, విశాఖపట్టణం–తిరుపతి, తిరుపతి–కాచిగూడల మధ్య మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సీపీఆర్వో తెలిపారు. 

మరిన్ని వార్తలు