టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో 45శాతం ఉత్తీర్ణత

8 Jul, 2018 02:06 IST|Sakshi
మాట్లాడుతున్న కడియం శ్రీహరి. చిత్రంలో రంజీవ్‌ ఆర్‌. ఆచార్య

ఫలితాలు విడుదల చేసిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి 

సాక్షి, హైదరాబాద్‌: పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శనివారం సచివాలయంలో విడుదల చేశారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,07,694 మంది విద్యార్థులు ఫీజు చెల్లించగా, 1,06,240 మంది పరీక్షలు రాశారు. వీరిలో 48,644 మంది పాసయ్యారు. ఉత్తీర్ణతా శాతం 45.79గా నమోదైంది. బాలురు 44.05 శాతం, బాలికలు 48.06 శాతం ఉత్తీర్ణులయ్యారు.

ఫలితాల్లో వరంగల్‌ గ్రామీణ జిల్లా 89.08 శాతంతో ముందు వరుసలో ఉండగా.. ఆదిలాబాద్‌ జిల్లా 23.58 శాతంతో చివరి స్థానంలో ఉంది. పరీక్ష ఫలితాలను విద్యాశాఖ bse.telangana.gov.inలో అందుబాటులో ఉంచింది. రీకౌంటింగ్‌ కోసం సబ్జెక్టుకు రూ.500 చొప్పున సంబంధిత హెడ్మాస్టర్‌ సూచన మేరకు బ్యాంకు ద్వారా ఈ నెల 8లోగా చెల్లించాలి. జవాబు పత్రాల జిరాక్సు ప్రతుల కోసం ఈ నెల 8 నుంచి 16 వరకు సబ్జెక్టుకు రూ.1,000 చొప్పున చెల్లించాలి. 2017 అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో 59.93% ఉత్తీర్ణత నమోదైంది.

మరిన్ని వార్తలు