4జీ నగరంగా వరంగల్

5 Feb, 2015 07:50 IST|Sakshi
  • తొలిసేవలు ఇక్కడి నుంచే... ఈ నెలాఖరుకల్లా ప్రారంభం
  • సాక్షి, హన్మకొండ: నాలుగోతరం సెల్యులార్ సేవలు తెలంగాణలో వరంగల్ నగరంలో మొదటిసారిగా అందుబాటులోకి రానున్నాయి. హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం అందించేందుకు రిలయన్స్ సంస్థ ఈ మేరకు అన్నీ సిద్ధం చేసింది. ఫిబ్రవరి నెలాఖరు కల్లా 4జీ సేవలు అందుబాటులోకి తెస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ సేవలు మొదట హైదరాబాద్‌లో అందుబాటులోకి తేవాలని రిలయన్స్‌జియో సంస్థ నిర్ణయించింది.

    అయితే హైదరాబాద్ నగరం మొత్తాన్ని 4జీ సేవల పరిధిలోకి తీసుకురావాలంటే ఐదు వేలకు పైగా టవర్లు నిర్మించాల్సి ఉంది. నిర్దేశిత గడువులోగా ఈ టవర్ల నిర్మాణం పూర్తి అయ్యే పరిస్థితి లేకపోవడంతో రిలయన్స్ సంస్థ రెండో ప్రాధాన్యతా నగరంగా వరంగల్‌ను ఎంచుకుంది.

    4జీ సేవలు అందించేందుకు నగరం పరిధిలో మొత్తం 126 టవర్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2015 ఫిబ్రవరి మొదటివారం నాటికి 110 టవర్లు బిగించారు. ఈ నెలాఖరు లేదా మార్చి మొదటివారంలో 4జీ సేవలు వరంగల్ నగరంలో ప్రారంభించేందుకు ఆ సంస్థ సమాయత్తమైంది. మొదటి ఆరు నెలలు ఉచితంగా వైఫై సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

మరిన్ని వార్తలు